Sunday, July 25, 2021
spot_img

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ,సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కనున్న పుష్ప సినిమా సరికొత్తగా ఉంటుందని ,ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇటీవలే విడుదలయిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక రానున్న రోజుల్లో అంతకు మించి ఉంటుందని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమాకి మూడు పాటలకు సంబందించిన ట్యూన్స్ పూర్తి చేశారు . అలాగే మరో రెండు పాటలకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయంట. మ్యూజిక్ పాన్ ఇండియా రేంజ్లోనే ఉండాలని , దేవిశ్రీ ప్రసాద్ సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారని సమాచారం.

ఇక ఈసినిమాకు మరొక విషయం హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే యాక్షన్ సీన్స్ పై సుకుమార్ ప్రత్యక దృస్టి పెట్టారట. అందులోని విజువల్ ఎఫెక్ట్స్ కూడా కీలకంగా ఉంటాయట. ఆడియన్స్ అంచనాలకు మించి ఉండాలని , నిర్మాతలు కూడా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఇక సినిమా కోసం దాదాపు 200 ల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇక బడ్జెట్ లో ఎక్కువ భాగం యాక్షన్ సీన్స్ కోసమే ఖర్చు చేయనున్నారు.

ముఖ్యంగా ఒక కీలకమైన సన్నివేశం కోసం 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో బన్నీ చేసే విన్యాసాలు ఓ రేంజ్లో ఉంటాయట. విజువల్ ఎఫెక్ట్స్ తో కూడా అత్యద్భుతంగా సుకుమార్ తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో రికార్డ్స్ కొల్లగొట్టడంఖాయం అంటున్నారు చిత్ర నిర్మాతలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles