Tuesday, August 3, 2021
spot_img

ఆడబిడ్డలకు ఆపదలో అండగా YS షర్మిల

కరోనా బాధితులకు తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు YS షర్మిల గారు . ఆపదలో ఉన్నవారి కోసం YSSR టీమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా ఎన్నో కుటుంబాలకి ఆర్ధిక అండ లేకుండా చేసిందని, కరోనా వచ్చి కుటుంబానికి అండగా ఉన్నవారి కోల్పోయారని ఆమె అన్నారు. ఈ మేరకు YS షర్మిల తన ట్విట్టర్లో ఈ విధంగా అన్నారు. కారొనా తో పెద్ద దిక్కుగా ఉండే తండ్రి, భర్త , కొడుకు ఇలా కోల్పోయిన మహిళలు కుటుంబాన్ని పోషించకుండా ,నిరాశ ,నిస్పృహలతో నిండిపోతున్న మహిళల బాధలను కొంచమైనా పంచుకోవాలని , ఆపదలో YSSR టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

తెలంగాణ ఆడబిడ్డల్లారా ధైర్యాన్ని కోల్పోకండి ,మీ కాళ్ళ మీద మీరు నిలబడే రోజులు మళ్ళీ వస్తాయని , మీరంతా నా YSR కుటుంబంగా భావించి నావంతు సహాయాన్ని చేయాలనుకుంటున్నా అని YS షర్మిల భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న ఆడబిడ్డలు YSSR టీమ్ ఫోన్ నెంబర్ 040-48213268కి కాల్ చేసి వారి సమాచారాన్ని తెలియచేయాలని కోరారు. ప్రస్తుతం కరోనా కారణంగా పార్టీ పనులను కొంతకాలం నిలిపివేస్తున్నట్లు చెప్తూ, ఈ YSSR టీమ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని YS షర్మిల అన్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles