Wednesday, July 28, 2021
spot_img

ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ప్రపంచంలోని వింత గ్రామాలూ

ప్రపంచంలో చాలా వింతలే మీరు విని ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ వింత గ్రామాల గురించి మీకు ఎప్పుడు తెలిసిఉండకపోవచ్చు ఎందుకంటే ప్రపంచం నలుమూలల ఉన్న ఈ ఒక్కో గ్రామంలో ఒక్కో విశేషం ఉంది. మరి ఆ గ్రామాలూ ఎక్కడ ఉన్నాయి? అక్కడ అంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏం ఉందొ మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశం లోని కవలల గ్రామం:   

              భారతదేశంలో కేరళా రాష్ట్రంలోని  కోధిని అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం లో  250 మంది కవల పిల్లలు ఉన్నారట. ఇది ప్రపంచ సరాసరి సంఖ్య కంటే 6 రెట్లు ఎక్కువని చెప్పుతున్నారు. ఇప్పుడు అక్కడి కవలల సంఖ్య 350 కి పెరిగిందట. అయితే 3 తరాల క్రితం మొదలైన ఈ కవల పిల్లల పుట్టుక ఈ గ్రామంలో అప్పటి నుండి ఇంకా పెరుగుతూనే ఉందని చెప్బుతున్నారు. అసలు దీనికి కారనమేమిటా నని ఇప్పటికి  పరిశోధనలు చేస్తున్నారు.

చైనా లోని మరుగుజ్జుల గ్రామం:

                  ఇక్కడ నివసిస్తున్న వారందరూ మరుగుజ్జులే. ఎందుకంటే ఇక్కడ నివసించేవారు 1.5 మీటర్ల ఎత్తుకంటే ఎక్కువ ఎత్తు ఉండరు. ఇంకా ఇక్కడ వీరి ఇళ్లు కూడా వింతగా ఉంటాయి. అంతేకాకుండా వీరు పాడే సంగీతం, వాయించే వాయిద్యాలు కూడా వింతగా ఉంటాయట.

ఆస్ట్రేలియా లోని భీమి క్రింద ఉండే పట్టణం:

             ఇది స్పటికతో నిండిన ఎడారి ప్రదేశం. భూమి ఉపరితలం మీద ఉండే వేడి నుండి తప్పించుకోవటానికి ఇక్కడున్న ప్రజలు భూమి క్రింద ఇళ్లు కట్తుకుని నివసిస్తున్నారట. భూమి పైన ఇళ్లు కట్టుకోవడాని అయ్యే ఖర్చు, భూమిని త్రవ్వి అక్కడ కట్టుకునే ఇళ్ల ఖర్చు ఒకటిగానే ఉంటుందట. ప్రపంచ మొత్తానికీ స్పటిక ఇక్కడి నుండే సరఫరా అవుతుంది. ఇక్కడ నివసించేవారు తవ్వుకున్న ఇంటి మట్తిని అమ్ముకుని జీవిస్తుంటారు.

ప్రపంచానికే అతి దూరం గా ఉండే గ్రామం:

                 ఎడింబరో ఆఫ్ ది సెవెన్ సీస్ అని పిలువబడే ఈ గ్రామం ప్రపంచ భూభాగానికే చాలా దూరం లో ఉన్న ఒక చిన్న ద్వీపకల్పం.

రష్యా లోని “చ్చెస్ సిటీ”:

              చెస్ ఆట మీద ఎక్కువ ఉత్సాహం చూపే రష్యా ప్రెశిడెంట్ కిర్సాన్ ఇల్యుంజినావ్ ఈ సెటిల్మెంట్ గ్రామాన్ని నిర్మించారు. చక్కటి రోడ్లు, అద్భుతమైన ఒక చ్చెస్ ప్యాలస్ మరియూ ఖరీదైన ఇళ్లు కలిగిన ఈ గ్రామమంలో ఎవరూ నివసించారు.

అమెరికాలోని ఈ గ్రామ జనాభా కేవలం ఒకరు మాత్రమే:

              అమెరికాలోని మొనోవీ అనే ఈ గ్రామములో 1930 లో 150 మంది నివసించేవారు. మిగిలిన అన్ని గ్రామాలలాగానే ఈ గ్రామములోని యువత కూడా పెద్ద పెద్ద నగరలాకు వలస వెళ్లేరు. 2000 లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామములో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళు భార్యాభర్తలు. అయితే 2004 భర్త చనిపోయిన తరువాత భార్య మాత్రమే మిగిలింది. ఆమే ఈ నగరానికి మేయర్. టాక్స్ కడుతూ ఆమె ఇంటికి దగ్గరున్న 4 వీధి దీపాలకూ మరియూ రోడ్దుకూ ప్రభుత్వం నుండి ఉపాధి తెచ్చుకుంటుంది.

ఈజిప్ట్ లోని గార్బేజ్ సిటీ:

            ఈజిప్టులోని మన్షియాట్ నజర్ అనే ఈ గ్రామము ను గార్బేజ్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడున్న గ్రామ వాసులు చెత్త్ ఏరుకుని దానిని నగరాలలో ఉన్న రీసైకిల్ కంపనీలకు అమ్ముకుని బ్రతుకు గడుపుతారట. అయితే ఈ గ్రామం చుటూ కూడా  ఆధునిక నగరాలు ఉన్నాయట. కానీ ఈ గార్బేజ్ సిటీ మాత్రం ఇప్పటికి ఇలానే ఉందని చెబుతున్నారు.

             ఇవే ఆశ్చర్యాన్ని కలిగించే ప్రపంచంలోని వింతైన కొన్ని గ్రామాలూ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,872FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles