Sunday, July 25, 2021
spot_img

ఇండియన్ రియల్ హీరో సోనూసూద్

ఇండియన్ రియల్ హీరో సోనూసూద్ కళ్ళు చెమర్చే వార్త చెప్పాడు. మిస్డ్ కాల్ ఇవ్వండి ఆక్సిజన్ ఇస్తానని ప్రకటించాడు. కరోనా జనాలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ఆక్సిజన్ దొరక్క చనిపోతున్నారు. అలాంటి సమయం లో ఒకేఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఆక్సిజన్ ఇస్తానంటూ, ఈ కష్ట కాలంలో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు సోనూసూద్. ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తూ వాటిని కొనలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ ఉచితంగా ఆక్సిజన్ సీలిండెర్స్ ను అందించేందుకు సిద్దమయ్యాడు.

అందుకే ఫ్రాన్స్ తో పాటు పలుదేశాలకు ఆర్డర్ ఇచ్చారు. ఢిల్లీలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం లో , ఆక్సిజన్ కావాలన్న వారు తనను సంప్రదించాలని ఆయన అన్నారు. ఢిల్లీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కువ సంఖ్యలో జనం కారొనా తో పోరాడుతున్నారు. అందులో చాలా మందికి ఆక్సిజన్ అందించాల్సి ఉంది. అందుకే వారికీ ఆక్సిజన్ అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆక్సిజన్ సిలిండర్ అవసరమైన వాళ్ళు ఈ నెంబర్ కు కాల్ చేయాలనీ చెప్పారు. ఆ నెంబర్ 02261403615 .

ఈ నెంబర్ ఉచితంగా సేవలను అందిస్తుందని అన్నారు. ఆక్సిజన్ సీలిండర్లు వచ్చేస్తున్నాయి , ఇక మరిన్నీ ప్రాణాలను కాపాడుకుందాం అన్నారు సోనూసూద్ . ఇంత సాయం చేస్తున్న సోను సూద్ నిజానికి దేవుడే. ఎందుకంటే మన దేశంలో ఇంత మంది రాజకీయ నాయకులూ చేయలేనిది, సోనూసూద్ గారు ఒక్కరే చేస్తున్నారు. కావున మనదేశానికి నిజమైన హీరో సోనూసూద్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles