Sunday, July 25, 2021
spot_img

ఈ పరిస్థితుల్లో జ్వరం వస్తే ఇలా చేయండి.

ప్రస్తుత పరిస్థితిలో జ్వరం వచ్చి మూడు రోజులయిన తగ్గకపోతే , జాగ్రత్త పడాలంటున్నారు వైద్యనిపుణులు. ఐదు రోజులు దాటితే ప్రమాదానికి దారితీస్తుందని అంటున్నారు. అందువల్ల మూడు రోజులు కాగానే ఎవరో ఒక వైద్య నిపుణుడిని కలవాలని చెప్తున్నారు. మూడు రోజులకే జాగ్రత్తపడితే మొదటి వారంలో స్టెరాయిడ్స్ ఉపయోగించే అవసరం ఉండదు. ఆసుపత్రికి వెళ్లకుండానే త్వరగా కోలుకుంటారు. ఒకవేళ జాగ్రత్త పడకుండా ఉంటె , రెండవ వారంలో వ్యాధి తీవ్రత వేగంగా పెరిగి ప్రాణాలకే ముప్పు రావచ్చు.

ఇప్పటికి వస్తున్నపేషెంట్స్ 90% కంటే తక్కువ ఆక్సిజన్ ప్రమాణాలతో వస్తున్నారు. వీరి ఆరోగ్యం వేగంగా క్షిణించటంతో పాటు, వెంటిలేటర్ అమర్చవలసిన పని అవుతుందని అంటున్నారు కిమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు డా.వి వి రమణ ప్రసాద్ గారు. రెండవ దశలో ఈ వైరస్ సామర్ధ్యం పెరిగి, వ్యాధి వ్యాప్తి వేగంగా పెరిగి సమస్య జఠిలమై, ఎక్కువ చేటు చేస్తుంది. మొదటి దశలో పెద్దవయస్సు వారు , బీపీ , షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతన్న వారికీ వచ్చేది. కానీ ఇప్పుడు 30 నుంచి 50 ఏండ్ల వయస్సు వారికి కూడా ఈ వైరస్ సోకి , వారి పరిస్థితి క్షిణిస్తోంది. అయితే ఐదో రోజు RTPCR -టెస్టింగ్ చేసుకున్న తర్వాత కూడా జ్వరం కొన్నసాగుతూ ,వారికీ దగ్గు ,ఆయాసం కూడా ఉంటె వెంటనే సిటీ స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ లో తేడాగా ఉంటె కోవిడ్ చికిత్స తీసుకోవాలి.

గతంతో పోల్చితే ఇప్పుడు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొత్తగా కొన్ని బయోలాజికల్స్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్మా థెరపితో కొన్ని ఫలితాలొస్తున్నాయి. తక్కువ ధరకే ఇతర ఇంజెక్షన్స్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు వైద్య పరంగా మెరుగైన స్థితిలోనే ఉన్నా , పేషెంట్స్ జబ్బు ముదిరాక , ఊపిరితిత్తులు పూర్తిగా పాడైన పరిస్థితుల్లో ఆసుపత్రులకు వస్తుండటం తీవ్ర సమస్యగా మారింది.మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే ఈ రెండవ వేవ్ లో సమస్యని అర్ధం చేసుకొని అందరూ జాగ్రత్తగా ఉండటం మంచిది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles