Sunday, July 25, 2021
spot_img

ఈ విషయంలో సీఎం జగన్ తోప్

రాష్ట్రాలు విడిపోయిన ఒకే తరహా పధకాలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక రాష్ట్రం కోసం మంచి చేయాలని చూస్తే , తమకు కూడా అలాగే చేయాలనీ పక్క రాష్ట్రం వారు కూడా కోరుకుంటారు. ఇటీవల కరోనా నేపథ్యంలో ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో వేరు వేరుగా పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ లో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చారు ఏపీ సీఎం జగన్ . ఈ దశలోనే ఏపీ ని ఉదాహరణగా చూపిస్తూ , తెలంగాణాలో కూడా కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ బాగా వినిపిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ,బీజేపీ, ఇతర పార్టీ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఒక పరిస్థితిలో కరోనా కష్టాలు తమ దృష్టికి వచ్చాయని మంత్రి కేటీర్ అన్నారు. కావున ఈ సమస్యను వీలైనంత త్వరగా సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి , ఖచ్చితంగా కారొనాను ఆరోగ్య శ్రీ లో చేరుస్తాం అని చెప్పారు. అయిన సీఎం కెసిఆర్ ఎందుకో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరో వైపు కరోనా కష్టకాలంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు, కెసిఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కరోనా మృతుల కుటుంబాలకు 15,000/-రూ .ల ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తూ , ఇటీవలే జగన్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

దీంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఇరుకున పడింది. సీఎం జగన్ అంతటితో ఆగకుండా , ఇటీవలే కొత్తగా వచ్చిన బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెరిగింది . అసలు కరోనా చికిత్సనే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురాలేదు తెలంగాణ సీఎం కెసిఆర్ . ఆంధ్రరాష్ట్రంలో మాత్రం సీఎం జగన్ కరోనా సంబంధిత వ్యాధులన్నింటిని కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చి ,పేద ప్రజలకు ఈ కష్ట కాలంలో అండగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలకు మెరుగైన చికిత్సను అందించటం ప్రభుత్వం కనీస ప్యాథమిక బాధ్యత. ఇకనైనా సీఎం కెసిఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.తాజాగా కారొనాను ఆయుష్మాన్ భారత్ లో చేరేసినట్లు తాజా సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles