Sunday, July 25, 2021
spot_img

ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ సారి సమ్మర్ సుర్రుమంటుంది. చాల చోట్ల 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు కరోనా టెన్షన్ మరోవైపు మండే ఎండలతో ప్రజలు పరేశానవుతున్నారు.ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

ఎవరి ఆరోగ్యం పై వారే ప్రత్యేక శ్రద్ద తీసుకోవలసిందే. ముఖ్యంగా ఆరోగ్య చిట్కాలను పాటించాలి. ఈ ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో అవగాహన ఉండాలి. శరీరానికి చలువ చేసే పదార్ధాలు మరియు మేలు చేసే వాటిని కూడా తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో వేడి చేసే పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు నిపుణులు ఇస్తున్న సలహాల గురించి తెలుసుకుందాం.

ముఖ్యంగా మాంసంలో అధిక ప్రోటీన్లు , కొవ్వు పదార్ధాలుంటాయి. ఎండలు మండే సమయంలో ఇలాంటి పదార్ధాలకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిది. ఎండాకాలంలో మాంసం , కారం , ఘాటు మసాలాల వాడకం తక్కువగా ఉండాలి. ఎందుకంటే వాటి వల్ల ఉదర సంబంధ వ్యాధులు వెంటాడుతాయి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా మామిడి పండ్లు తినేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే ఈ సమయంలోనే దొరుకుతాయి. మామిడి పండ్లు ఆరోగ్యానికి ఉపయోగపడతాయని కొందరు వైద్యులు చెప్తారు కానీ ఇవి శరీరానికి అధిక వేడిని కలిగిస్తాయి. పరిమితికి మించి మామిడి పండ్లు తినటం ఏ మాత్రం మంచిది కాదు.

ఇక వేసవిలో అందరు చల్లని నీటిని త్రాగటానికి ఇష్టపడతారు,కానీ దానివల్ల శరీరంలో అధిక వేడి ఉత్పన్నమవుతుంది. సాధ్యమైనంతవరకు కుండ లోని నీటిని త్రాగటం మంచిది అంటున్నారు నిపుణులు . ఈ విధంగా కొన్ని పాటించటం వలన వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles