Sunday, July 18, 2021
spot_img

ఎన్టీఆర్ పుట్టినరోజున రాజమౌళి RRR ప్లాన్

RRR సినిమాపై విడుదల రోజు ప్రకటించినప్పటికీ , అభిమానులకు రిలీజ్ పై సందేహంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ డేట్ వాయిదా పడింది. పరిస్థితులు సహకరించకపోవడమో , కావాలని చేయటమే కానీ దాని ప్రభావం సినిమా పై పడే అవకాశం ఉంది. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం RRR షూటింగ్ మొదలయింది. జక్కన చేసే సినిమాకి ఒప్పుకున్నా ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఈ సినిమాకే పరిమితం అయ్యారు. మరో వైపు ప్రేక్షకులు తొందర పెడుతున్నారు . దానికి తోడు కరోనా వచ్చి పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పటికే వాయిదాలు పడుతుంటే , దీని వలన మరింత ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ అది కూడా కష్టమే అంటున్నారు చిత్రం యూనిట్ .

కరోనా రెండవ దశలో భాగంగా సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయని అందువల్ల ఇక మరింత ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. థియేటర్ లు కూడా మూతపడ్డాయి, అవి ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలీదు. కావున రాజమౌళి మరియు సినిమా టీమ్ మాట్లాడుకుని , సినిమాని వాయిదా వేస్తూ , రిలీజ్ కు కొత్త తేదీలను ప్రకటించాలని చూస్తున్నారని తాజా వార్త. ఈ నేపథ్యంలోనే మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా RRR రిలీజ్ డేట్ చెప్పాలని జక్కన్న ప్లాన్ చెసున్నాడట. ఈ ఏడాది రిలీజ్ లేదు కాబట్టి ప్రస్తుత మరియు భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ,దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారట. మరి ఎన్టీఆర్ పుట్టినరోజున RRR సినిమాకి సంబందించిన కొత్త న్యూస్ వస్తుందో , రాదో వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles