Sunday, July 25, 2021
spot_img

ఎలుగుబంటి ని చూసిన రైతులు కేకలు వేస్తూ పరుగులు తీశారు.

కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ నల్లమల లో ఎలుగుబంట్ల సంతతి పెరిగింది, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ భారీ సైజ్ ఎలుగుబంటి ఆత్మకూరు మార్కెట్ యార్డు పొదల్లో సంచరించింది. అక్కడున్న కుక్కలు తరమండంతో ఆ ఎలుగు మనిషిలాగా… చెట్టెక్కి ఆపై గోడపైకి దిగి బయటకు పరుగులు తీసింది. అప్రమత్తమైన అటవీశాఖ భందించే ఆలోచనలో ఉండగానే వారి పక్కనుంచే ఎలుగుబంటి ఆత్మకూరు – నంద్యాల రోడ్డు వద్ద ఉర్దూ స్కూల్ వైపు వెళ్ళింది. అప్రమత్తమైన డిఎఫ్ఓ ఆషాకిరణ్ ఎలుగుబంటి ని జీవుల తో అనుసరించి అక్కడినుంచి బైర్లుటి రేంజ్ రుద్రకోడూరు సెక్షన్ రిజర్వ్ ఫారెస్ట్ వైపు మళ్లింది.

పొలాల్లో ఎలుగుబంటి హల్చల్ చేసి రైతులు, వ్యవసాయ కూలీల వెంట పడింది. అనుకోని ఘటనతో ఎలుగుబంటి ని చూసిన రైతులు కేకలు వేస్తూ పరుగులు తీశారు, ఎట్టకేలకు మూడు గంటల పాటు ముప్పతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ని అటవీశాఖ సురక్షితంగా నల్లమల అటవీ ప్రాంతంలో సాగణంపి ఊపిరి పీల్చుకుంది. అసలు ఎలుగుబంటి అడవి నుంచి బయటకు రావడానికి పొలాల గట్ల వెంట ఉన్న రేగు పండ్ల చెట్లే కారణమని.. విస్తారంగా రేగు పండ్లు ఉండడంతో బయటకు వచ్చి ఆత్మకూరు పట్టణ శివారులోకి వచ్చిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎట్టకేలకు ఎలుగు బంటిని పంపి , అక్కడి ప్రజలు తేరుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles