Thursday, August 5, 2021
spot_img

కరోనా కు DRDO కొత్త మందు

ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారికి వాక్సిన్ తప్ప , ఇప్పటి వరకు మందులు లేవు. తాజాగా భారత రక్షణ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఓ మెడిసిన్ తాయారు చేసి , విడుదల చేసింది. దీనిని అత్యవసర సమయంలో వాడవచ్చని భారత ఔషధ నియంత్రణ సంస్థ సూచించింది. తాజాగా ఈ మందును కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్ నాధ్ సింగ్ మరియు హర్షవర్ధన్ విడుదల చేశారు. కరోనా వైరస్ మీద పోరులో ప్రపంచం మొత్తాన్ని ఈ మందు కాపాడుతుందని చెప్పారు, పదివేల దోసులను ఈ వారం తీసుకువచ్చామని DRDO అధికారులు తెలిపారు. వాటిని కరోనా బాధితులకు ఇస్తున్నట్లు చెప్పారు.

ఈ మందును మన దేశంలోనే DRDO ఒక ప్రత్యేకమైన లాబ్ లో తాయారు చేశారని చెప్పారు. దీనికి హైదరాబాద్ కు చెందిన డా. రెడ్డీస్ ల్యాబ్ సహకాన్ని అందించింది. ఈ కొత్తమందు పేరు 2DEGE. అంటే 2-డీఆక్సీ -డీ -గ్లూకోజ్ . ఈ మందు ద్వారా పేషెంట్స్ త్వరగా కోలుకుంటున్నారని, ఆక్సిజన్ పై ఎక్కువ సమయం ఆధారపడకుండా ఉంటారని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ మందు వైరస్ పెరుగుదలను అరికట్టి, వైరస్ ఇతర ఏ భాగాలకి సోకకుండా అవుతుందని చెప్తున్నారు. అలాగే శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ అదుపులో చేస్తుందని కూడా చెప్పారు. ఇప్పటి వరకు ఢిల్లీ ,మహారాష్ట్ర , తెలంగాణ ,పశ్చిమ బెంగాల్ ,గుజరాత్ , రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో 110 మంది పేషెంట్లను తీసుకొని క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించారు. దీనిని ఉపయోగించిన మూడవ రోజుకి ఆక్సిజన్ సిలిండర్ అవసరం తగ్గిపోయిందని , ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.

కారొనతో పాటు బ్లాక్ ఫంగస్ తో కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇలాంటి మందు రావడం వల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అయితే దీని ధర ఆరు వందల వరకు ఉండవచ్చని DRDO ప్రతినిధులు చెప్తున్నారు. ఈ మందును రెండుగ్లాస్ ల మంచినీటిలో కలుపుకుని , రోజుకు రెండు సార్లు త్రాగాలని చెప్తున్నారు. అవసరాన్ని బట్టి దీనిని 5 నుంచి 7 రోజుల వరకు తీసుకోవచ్చని చెప్తున్నారు. తర్వాత వైరస్ పెరుగుదల క్రమంగా తగ్గిపోతుంది . ఈ మందును కరోనా తీవ్రంగా ఉండే వారికీ కూడా వాడొచ్చని చెబుతున్నారు. హోమ్ ఇసోలాటిన్ లో రికవరీ అయ్యే వారు దీనిని వాడనవసరం లేదని చెప్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles