Saturday, July 17, 2021
spot_img

కరోనా తగ్గినా.. శృంగారం అప్పుడే..

కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రజలను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది.. కరోనా పై ప్రభుత్వం ఎంత కట్టడి చేయాలని చుసిన కూడా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నయి.. అయితే చాలా భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా, తగ్గిన తర్వాత నెల పాటు శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. కనీసం మూడు వారాలైనా నిగ్రహం పాటించాలి. దంపతులిద్దరికీ కరోనా వస్తే నెల కంటే ఎక్కువ కాలం దూరంగా ఉండాలి. లేదంటే ఒకరి ప్రభావం మరొకరిపై పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యపై జన్యుపరంగా ఎలాంటి పరిశోధనలు జరగలేదు.

కానీ, పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కరోనా తగ్గిన తర్వాత కూడా కొంతమందికి లక్షణాలు ఉంటున్నాయి. దీనికితోడు శరీరం నీరసించి ఉంటుంది. శృంగారం అనేది ఒత్తిడితో కూడుకున్నది. కరోనా వచ్చిన పురుషుల వీర్యంలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొన్నా ఇబ్బందేమీ ఉండదు. వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటే అవి తగ్గేంత వరకు దూరంగా ఉండటం మంచిది.ఇక గర్భిణీలు అయితే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలని అంటున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles