Saturday, July 17, 2021
spot_img

కరోనా పై లేటెస్ట్ న్యూస్ :


అపోహలతో అనవసర భయాలు పెరుగుతాయి. భయం వ్యాధి నిరోధక శక్తిని దెబ్బ తీస్తుంది. ఇప్పటి వరకు 20,000లకు పైగా కరోనా రోగులకు విజయవంతంగా చికిత్స అందించామని , ఆ అనుభవంతో సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేలా ఒక మార్గదర్శిని రూపొందించామని హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంట్రాలజీ [AIGU ] నిపుణుల బృందం సూచించింది. ఇందులో భాగంగా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఎలా ఉండాలో వివరించారు. కరోనా సోకిన వ్యక్తి ప్రత్యేక గదిలో ఉండాలి. కుటుంబంలో ఇతరులు మాస్క్ ధరించాలి.

ప్రత్యేక స్నానాల గదిని వినియోగించాలి. రోగి వాడే పాత్రలు , దుస్తులు సహా అన్ని వేరుగా ఉంచాలి. గదిలోకి గాలి ,వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరు ఉండే ప్రదేశంలో రోగి ఉంటె, ఎయిర్ కండిషనర్ వాడకూడదు. ఇక ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూసుకోవాలి. ద్రవరూప పదార్దాలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు,ఆకుకూరలు బాగా తినాలి.

ప్రోటీన్లు అధికంగా ఉండే పన్నీర్ వంటి పదార్ధాలు బాగా తినాలి. వేయించింన [ఫ్రై ] పదార్ధాలకు దూరంగా ఉండాలి. పుల్లని పండ్లు రుచిని కోల్పోకుండా చూస్తాయి. ఇంట్లోనే ఆహారం తయారు చేసుకోవడం మంచిది. ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలో అనే విషయం పై స్పష్టత అవసరం.ఆరు నిముషాలు గదిలో నడిచిన తరువాత ఆక్సిజన్ పరిశీలించాలి. 95 నుంచి నాలుగు పాయింట్స్ తగ్గితే అప్రమత్తం కావాలి. వెంటనే ఆందోళన చెందకుండా, రెండు గంటల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. అప్పుడు కూడా తగ్గుతూ కనిపిస్తే , వెంటనే ఆసుపత్రిలో చేరాలి. 5 లేక 6 రోజుల వరకు జ్వరం తగ్గకపోతే, ఒక్కసారిగా రక్త పోతూ పడిపోతే ,తీవ్ర నీరసం ,దగ్గు ,ఆయాసం వంటి సమస్యలు ఏర్పడితే వెంటనే ఆసుపత్రిలో చేరి , చికిత్స తీసుకోవాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles