Sunday, July 25, 2021
spot_img

కృష్ణపట్నంలో కరోనా మందు

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని కృష్ణపట్నం గ్రామం లో కరోనా ఆయుర్వేద ముందు కోసం క్యూ లైన్ లో ఉన్న జనం బారులు తీరుతున్నారు. మొదట 500 మందితో మొదలు పెట్టి ఇవాళ 20,000 మందికి పైగా ఈ మందు కోసం వస్తున్నారు. ఈ మందును ఉచితంగానే ఇస్తున్నారు . అలాగే ఎవరికైనా తోచిన డబ్బును ఇచ్చి వెళ్తున్నారు. ఈ మందును పూర్తిగా వనమూలికలతో తాయారు చేస్తున్నారు. ఈ ముందుకు ఉపయోగపడే సామాగ్రిని కూడా అక్కడ ఉండే ప్రజలే తీసుకొచ్చి వైద్యునికి ఇస్తున్నారు.

కరోనా తో ఏ పరిస్థితిలో ఉన్నకాని వారు ఇచ్చే మందుతో చాలా తొందరగా తగ్గుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఏ మందు లో భాగంగా రెండు చుక్కలు కళ్ళల్లో వేస్తారు ,అంతే ఒక్కసారిగా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. అయితే ఈ మందులో ముల్లు వంకాయ, నేరేడు ఆకు , మామిడి ఆకు ఇలా మొత్తం 6 నుంచి 9 రకాల మూలికలతో ఈ మందును తాయారు చేస్తారు. ఈ మందు కోసం రాజకీయ నాయకులూ,ఇతర విఐపీలు కూడా రావడంతో ఈ మందు పట్ల అందరికి విశ్వాసం పెరిగి పోతుంది. కృష్ణపట్నంలో ఈ మందును డ్రాప్స్ మరియు పొడిగా ఇస్తున్నారు. ఈ విధంగా మొత్తానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కరోనా ముందుకు మారుమోగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles