Sunday, July 18, 2021
spot_img

కొందరు వాటిని పాటించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది. మరోపక్కన సోషల్ మీడియాలో అనేక చిట్కాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నమ్మాలో కూడా తెలియటంలేదు. మరికొందరు వాటిని పాటించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వేడి నీటిని త్రాగడం ,వేడి నీటితో స్నానం చేయటం వల్ల కరోనా నయమవుతుందనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.వేడి నీళ్లు కరోనా ని చంపటం లేదా తగ్గించటం నిజం కాదని తేల్చి చెప్పేసింది.

ప్రయోగశాలలో ప్రత్యేక పద్దతిలో 60 నుంచి 70 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుందని చెప్పింది. వేడి నీటిని త్రాగడం, స్నానం చేయటం వలన శరీరానికి ఉపశమనం కలుగుతుందనేది వాస్తవం. వేడి నీళ్ల స్నానంతో ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా సరిగ్గా అవుతుంది. అలాగే మంచి నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

వేడి నీటిలో కొంచెం ఉప్పు ,చిటికెడు పసుపు వేసుకొని ఆ నీటిని తీసుకొని పుక్కిలించటం వలన గొంతు సమస్యలకు ఉపశమనం కలుగుతుందని ఆయుష్ శాఖ సూచించింది. ఇలా వేడి నీటిని త్రాగడం వల్ల శరీరంలోని వ్యర్దాలు బయటకి పోతాయి, కేంద్రనాడి వ్యవస్థ మెరుగుపడుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అయితే వేడి నీటిని త్రాగడం, స్నానం చేయటం వలన కరోనా తగ్గదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles