Tuesday, August 3, 2021
spot_img

క్రేజీ విజయ్ దేవరకొండ తగ్గేదేలే.

టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తో దూసుకెళ్తున్నాడు. తన కెరీర్ ప్రారంభించిన కొద్దీ రోజుల్లోనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది ఫాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈ రౌడీ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. సినిమాలో విజయ్ హీరో ఇజానికి ఎంత మంది అభిమానులు ఉన్నారో, బయట కూడా అతడి ప్రవర్తనకి , నటనకి అదే రేంజ్ లో అభిమానులు ఉన్నారు. అలా సోషల్ మీడియాలో రోజు రోజుకి తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు.

ఇప్పుడు దక్షిణ భారత దేశంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానం లో ఉన్నాడు. సౌత్ ఇండియాలో పన్నెండు మిలియన్ల ఫాలోవర్స్ తో నెంబర్ వన్ హీరోగా నిలిచాడు మన విజయ్ దేవరకొండ. మిగతా హీరోలు అల్లు అర్జున్ 11. 9M , మహేష్ బాబు 6.7M , ప్రభాస్ 6.5M, రామ్ చరణ్ 3.9M , ఎన్టీఆర్ 2.6M, కన్నడ స్టార్ హీరో యష్ 5M ఫాలోవర్స్ తో ఉండగా , వీరందరిని వెనక్కి నెట్టి విజయ్ 12M ఫాలోవర్స్ తో నెంబర్ వన్ స్థానానికి ఎడిగాడు.ఇక విజయ్ దేవరకొండ , పూరి జగన్నాధ్ తో పాన్ ఇండియా సినిమా లైగర్ చేస్తున్నాడు. ఏది ఏమైనా పాన్ ఇండియా సినిమా విడుదలయ్యాక ,విజయ్ ఏ రేంజ్ లో వేళ్తాడో వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles