Saturday, July 24, 2021
spot_img

ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో  టైగర్ టీం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం లో కరోన బారిన పడిన ఎన్టీఆర్ త్వరగా కొలుకోవాలి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు.అనంతరం అనాధ ఆశ్రమం లో కేక్ కట్ చేసి అనాధాలకు అన్నదానం నిర్వహించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ కరోన నుండి త్వరగా కొలుకొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ మరెన్నో జరుపుకోవాలి అన్నారు. టాలీవుడ్ లో అందరి బాగు కోరే వ్యక్తి ఎన్టీఆర్ గారు ఒక్కరే అంటూ చెప్పారు. ఇదే విధంగా ఎన్టీఆర్ గారు ఇంకా మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి అగ్రగామిగా నిలవాలని ఫాన్స్ కోరారు. ఇలాంటి కరోనా సమయంలో కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు చేసిన ఫాన్స్ మురిసిపోతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ మాములుగా లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,866FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles