Wednesday, July 21, 2021
spot_img

జగిత్యాలలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభికం

జగిత్యాల జిల్లా వాసులు సంతోషంలో నిండిపోయారు. ఎందుకంటే మల్యాల మండల కేంద్రంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల మరియు నర్సింగ్ కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు సీఎం కెసిఆర్ ఉత్తుర్వులను జారీచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్  చిత్ర పటానికి పాలాభిషేకాలతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీర్ గారికి చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల మాయొక్క చిరకాలపు కోరిక అని, దానిని నెరవేర్చిన సీఎం కెసిఆర్ గారికి ఈ విధంగా పాలాభిషేకం చేస్తున్నాం అని అన్నారు.

ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన మా జగిత్యాల జిల్లా వాసుల కష్టాలను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రత్యేక చొరవతో జిల్లాకు మెడికల్ , కాలేజీలు మంజూరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాకు వైద్య కళాశాలతో పాటు రీజినల్ డ్రగ్ సెంటర్ కూడా మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే రవిశంకర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే దీని వలన జిల్లాలో అధివృద్ధి ఇంకా మెరుగుపడుతుందని రవిశంకర్ మరియు ప్రజలు కోరుకుంటున్నారు.
జగిత్యాలలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభికం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,862FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles