Wednesday, August 4, 2021
spot_img

తాక్టే అంటే అర్థం ఎంటో తెలుసా ?

ప్రస్తుతం భారత దేశాన్ని ఊపిస్తున్న తుఫాన్ తాక్టే తీవ్రత గంట గంటకు పెరుగుతూ వస్తుంది.అరేబియా సముద్రం నుంచి తీరానికి దూసుకొస్తున్న తౌక్టే తుఫాను ప్రభావం తీర ప్రాంతాల్లో మొదలైంది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌, కర్ణాటక తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అయితే తుఫాను సృస్టించే బీభత్సం, ఆస్తి, ప్రాణ నష్టం గురించి చెప్పుకోవడం కోసం ప్రతి తుఫానుకు ఒక పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. అదే ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు ఈ తుఫాన్‌కు తౌక్టే అని పేరు పెట్టారు.

అసలు ఈ తౌక్టే అనే పదానికి అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు.. బర్మా.. మహన్మార్ లో ఈ పేరుకు అర్థం పెద్దగా అరిచే బల్లి అని.2021లో ఏర్పడ్డ ఈ తొలి తుఫాన్‌కు పేరు పెట్టే అవకాశం మయన్మార్‌కు లభించింది. దాంతో మయన్మార్ వాతావరణ విభాగం తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును ఈ తుఫానుకు పెట్టింది..నామకరణ కార్యక్రమాన్ని వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, పానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో సభ్యదేశాలుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలు ఉన్నాయి. వాటిలో వచ్చే ఎటువంటి భయంకర తుఫాన్ లకు కూడా పేర్లు పెట్టనున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles