Sunday, July 25, 2021
spot_img

తిన్న తర్వాత వీటిని అస్సలు చేయకండి..చేస్తే ఇక అంతే..!

చాలా మంది భోజనాలు చేసిన వెంటనే ఏదైనా తింటారు.. లేదా ఏదైనా తాగుతారు.. ఎలా చేస్తే ప్రాణాలకే ముప్పు వస్తుందని అంటున్నారు.. మరీ భోజనం చేసిన వెంటనే అస్సలు చేయకూడనివి ఎంటో.. ఎందుకు చేయొద్దు అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

స్నానం : తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సరిగా ఉండదు. దీంతో బొజ్జ వస్తుంది. అంతేకాదు విరోచినాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే 30 నిమిషాలు అయినా గ్యాప్ ఇవ్వాలి.

పండ్లు : అన్నం తిన్న వెంటనే పండ్లు తినడం వల్ల తిన్నది అరగడానికి చాలా సమయం పడుతుంది. మళ్లీ గుండెల్లో మంటగా ఉంటుంది. శరీరంలో ఫ్యాట్ కూడా చేరుతుంది.

లూజ్ చేయకూడదు : భోజనం చేసిన వెంటనే కడుపు బిర్రుగా ఉంటుంది. దీంతో బెల్టును లూజ్ చేస్తారు. ఇలా ఎప్పటికీ చేయకూడదు. తినకముందు ఎలా ఉందో అలానే ఉంచుకోవాలి.

నీరు తాగకూడదు : తిన్న వెంటనే చల్లనీరు తాగకూడదు. ఇలా తాగడం వల్ల ఆహారం గడ్డ కడుతుందట..

బ్రష్ చేయడం: నిద్రపోయేముందు బ్రెష్ చేయడం మంచిది. అలా అని అన్నం తిన్న వెంటనే బ్రెష్ చేయకూడదు.. అరగంట ఆగి చేయడం మంచిది..

దుమపానం: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఆహారం తీసుకున్న తర్వాత ధూమపానం చేస్తే ఒక సిగరెట్, పది సిగరెట్లతో సమానం. దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిద్ర : నిద్ర జీవితంతో ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అది కూడా తిన్న వెంటనే అసలు నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏర్పడుతుంది.

ఇక పోతే హాట్ డ్రింక్స్, లేదా టీ , కాఫీ లను అస్సలు తీసుకోకూడదు.. అలా చేస్తే మొదటికే మోసం వస్తుందట.. జాగ్రత్త సుమీ..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles