Tuesday, August 3, 2021
spot_img

దీప్తి సునయన – షణ్ముఖ్ పెళ్లి ఎప్పుడు?

సోషల్ మీడియా లో పాపులర్ అవుతున్న వ్యక్తులు వారి వ్యక్తిగత జీవితంలోని సంఘటనలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రెటీ గా మారీన దీప్తి సునయన , షణ్ముఖ్ ల గురించి ప్రస్తుతం సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికి తెలుసు. దీప్తి సునయన సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో సెలెబ్రెటీ గా మారింది. అంతే కాకుండా ఈ గుర్తింపుతో బిగ్ బాస్ లోను పాల్గొంది. ఇక షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్ గా నిలిచి, ప్రేమకు సంబందించిన వెబ్ సిరీస్ లతో నటించి చాలా ఫేమస్ అయ్యాడు.

ఇతనికి కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. దీప్తి సునయనతో కలిసి కొన్ని వీడియోలు కూడా చేసాడు షణ్ముఖ్ . ఇక వీరిద్దరి కాబినేషన్లో వచ్చిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ హాట్ టాపిక్ గా మారింది. అలాగే బయట కూడా వీరిని చూసి నిజంగానే వీరి మధ్యన ఏదో ఉందన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక వారిద్దరూ తమ రేలషన్ పై ఇలా చెప్పారు,మేము ఆఫ్ స్క్రీన్ కపుల్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే విధంగా వీరి చేతులపై ఒకేరకమైన టాటూ లు కూడా అందరిని కాస్త ఆలోచనలో పడేలా చేస్తున్నాయి.

ఇదిలా ఉంటె తాజాగా వీరిద్దరి రిలేషన్ గురించి ఓ వెబ్ సిరీస్ నటుడు సూర్య స్వామి ఓ ఇంటర్వ్యూలో ఈవిధంగా సమాధానమిచ్చాడు. అందులో దీప్తి సునయన , షణ్ముఖ్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. అందులో తప్పేముంది ఎవరి ఇష్టం వారిది . ఇంకో రెండేళ్ల లో వారు పెళ్లి కూడా చేసుకోవచ్చని సూర్య చెప్పిన విషయం బాగా వైరల్ గా మారింది. ఇక ఈ విషయం పై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,883FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles