Tuesday, August 3, 2021
spot_img

పంతులు నీ ఐడియా అదుర్స్ ..

కరోనా వల్ల చాలా మందికి చావు తెలివితేటలూ వస్తున్నాయి.. బైక్ పై హెల్మెట్ ఇప్పుడు ఎన్ని విధాలుగా పనికి వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. హెల్మెట్ తో ఓ పూజారి చేసిన పనికి అందరూ నోర్లు వెళ్ళబెట్టారు.. ఆయన ద్విచక్ర వాహనం పైన మాత్రమె కాదు వృత్తిలో కూడా హెల్మెట్ ను మాములుగా వాడలేదు. ఎక్కడ పూజలు జరిగిన కూడా ఆయన హెల్మెట్ తో వెళ్ళడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది..

మరి కొందరేమో ఇదేం పిచ్చి అని నవ్వుకున్నారు.. అయినా ఆయన మాత్రం ఆ హెల్మెట్ లేకుండా బయటకు రావడం లేదు. వివరాల్లోకి వెళితే..ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఓ పూజారి వాహనం నడిపేటప్పుడే కాదు, వృత్తి ధర్నాన్ని నిర్వర్తించేటపుడు కూడా హెల్మెట్‌ను వీడటం లేదు. షాప్ ఓపెనింగ్ చేయించడానికి వచ్చిన ఓ పూజారి మాత్రం ఏకంగా హెల్మెట్ పెట్టుకొని పూజలు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.మొదట అందరూ నవ్వుకున్నా తర్వాత కరోనా నేపథ్యంలో ఇంత శ్రద్దగా జాగ్రత్తలు తీసుకోవడం చూసి బాగుందని మెచ్చుకుంటున్నారు. కాగా వేగంగా విస్తర్తిస్తున్న కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇపుడు లాక్ డౌన్ అమలు చేస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles