Thursday, August 5, 2021
spot_img

పాన్ ఇండియా రికార్డ్స్ కు సిద్దమైన RRR

ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ RRR మూవీ . ఈ సినిమాలో రాజమౌళి ఎలాంటి సీన్స్ చూపించబోతున్నాడో అంటూ ఒకటే హాట్ హాట్ విషయాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ సీన్స్ సినిమాకే హైలెట్ అన్న ప్రచారం గతంలో జరిగింది. ఇంటర్వెల్ తర్వాత రామ్ చరణ్ యాక్షన్ సీన్ కి గూస్ బంప్స్ తెప్పిస్తారని వినిపిస్తోంది.

RRR షూటింగ్ చివరి దశలో ఉండటంతో సినిమా గురించి ఏ చిన్న వార్త తెలిసిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అవుతుంది. తాజాగా ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాల గురించి న్యూస్ బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో కొమురంభీం , అల్లూరి సీతారామరాజు ఓ జైల్లో కలుసుకుంటారట., ఆ సన్నివేశాలని ఎమోషనల్ గా తెరకెక్కించాడట రాజమౌళి. అంతేకాదు ఈ స్కీన్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోందని తాజా న్యూస్.

ఈ 20 నిమిషాల సీన్ సినిమాకె హైలెట్ అని చెబుతున్నారు. ఆ 20 నిమిషాల్లో ఓ పోరాట సన్నివేశంలో అల్లూరి సీతారామరాజు , కొమురంభీం భావోద్వేగ రూపం చూపించేలా జక్కన్న భారీ రేంజ్ లో తెరకెక్కించాడట. అసలు ఈ వార్తల్లో నిజమెంత ? నిజంగానే ఆ సినిమాలో ఆ సీన్స్ ఉంటాయా, అసలు ఈ విషయాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో అని అందరు RRR మేకర్స్ వైపే ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై జక్కన్న భారీ అంచనాలతో రికార్డ్స్ బ్రేక్ చేసేలా ఉన్నాడని చెప్పవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles