Thursday, August 5, 2021
spot_img

పుష్ప తో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 50 కోట్లు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి తీస్తున్న పుష్ప మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న పుష్ప సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇందులో మొదటి భాగం ఆక్టోబరులోనూ , రెండవ భాగం వచ్చే ఏడాదిలోనూ విడుదల కానున్నాయట. అయితే పుష్ప సినిమాకు అల్లు అర్జున్ రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని , తాజాగా ఫిలింనగర్ లో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న వారంత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం వాళ్ళతో పోల్చితే చాలా తక్కువ తీసుకుంటున్నాడని ప్రచారం సాగుతోంది. కానీ పుష్ప సినిమాతో బన్ని రెమ్యూనరేషన్ కూడా టాప్ కి వెళ్ళబోతోందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం బన్ని కేవలం 25 కోట్ల రూపాయలుగా మాత్రమే రెమ్యూనరేషన్ గా డీల్ చేసుకున్నాడట. ఆ తర్వాత సినిమా లాభాల్లో వాటా అడిగాడంట అని ప్రచారం కొనసాగుతోంది.

ఇక పుష్ప సినిమాని రెండు భాగాలుగా తీస్తారనగానే , అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ డబుల్ అయిందట. రెండవ పార్ట్ కోసం అతను ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ వసూల్ చేయనున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావడం తో పాటు, బన్ని దీని కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. కావున అతని కష్టానికి తగినట్లుగానే నిర్మాతలు భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బన్ని రేంజ్ రోజు రోజుకి మరింతగా పెరిగిపోతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles