Tuesday, July 20, 2021
spot_img

ప్రభాస్ సాలార్ మూవీ ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలిలో ద్వి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అమరేంద్ర బాహుబలిగా , శివుడిగా రెండు విభిన్న పాత్రలలో తనధైన రీతిలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత సాహో సినిమాతో కాస్త దెబ్బతిన్న , ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాతో లవర్ బాయ్ గా రాబోతున్నాడు. బాలీవుడ్ లో ఒక్కసారి లవర్ బాయ్ అని పేరు వచ్చిందంటే అతన్ని స్టార్ హీరోని చేస్తుందన్నమాట. ఇక ఈ రాధే శ్యామ్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న మరో సినిమా సలార్. కెజిఫ్ డైరెక్టర్ ప్రసాద్ నీల్ ఈ సినిమాను తీస్తుండటంతో ,ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా ఎలా ఉండబోతుందో, దీనిని ఎప్పుడు విడుదల చేస్తారో,ఈ సినిమాలో ప్రభాస్ ఏ రేంజ్ మాస్ యాక్షన్ చేయబోతున్నాడో అంటూ ఫాన్స్ మరింతగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కొంత మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అంచనాలను భారీగా పెంచేస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ప్రభాస్ ఈ సినిమాలో ద్వి పాత్రలో కనిపిస్తారని చెప్తున్నారు.

కానీ ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు ఈ సినిమాలో డబుల్ యాక్షన్ లో ఖచ్చితంగా కనిపిస్తారని చెప్తున్నారు. ఒక పాత్రలో నెగటివ్ గా ఉంటె , మరో పాత్రలో పాజిటివ్ గా ఉంటారని చెప్తున్నారు. ఈ రకమైన పాత్రలలో గతంలో ప్రభాస్ బిల్లా సినిమాలో నటించి మెప్పించారు. ఆ సినిమాలో బిల్లా ,రంగా గా రెండు విభిన్న క్యారెక్టర్స్ లో చేశాడు. మరి ఇంతలా ఊరిస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియాలంటే మనం టీజర్ , ట్రైలర్ వచ్చే వరకు ఆగాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,860FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles