Sunday, July 18, 2021
spot_img

ప్రభుత్వాలు సోనూసూద్ పై విషాన్ని చిమ్ముతున్నాయి.

కరోనా వచ్చినప్పటి నుండి నటుడు సోను సూద్ సేవలు మొదలయ్యాయి. కరోనా రెండవ దశలో ఏ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయో అదే స్థాయిలో సోను సూద్ సేవలు కూడా పెరుగు తున్నాయి. సుమారు నాలుగు వందల మంది అనుచరులతో దేశమంతటా సేవలను అందిస్తున్నాడు సోను. ఎక్కడి నుండి సహాయం కావాలని పిలుపు అందిన వెంటనే వాలిపోతున్నారు. ఆక్సిజన్, బెడ్ ఇతరత్రా అవసరాలకు తామున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నాడు. అయితే ఇంతగా సహాయం చేస్తున్న అతని మీద దుష్ప్రచారం కూడా కొనసాగుతుంది. పేరు కోసమే సహాయం చేసుకుంటున్నాడనే వారు కూడా ఉన్నారు.

ముఖ్యంగా ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వస్తున్న చోట అధికార పార్టీ మద్దతుదారులు సోను సూద్ ను లక్ష్యం గా చేసుకుంటున్నారు. అతని సేవలు తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనే ఒడిశాలో వెలుగు చూసింది. ఒడిశా రాష్ట్రంలో గంజాం జిల్లాలో ఒక వ్యక్తికి ఆక్సిజన్ సిలిండర్ బెడ్ కావాలని వారు సోను సూద్ టీమ్ ను కోరారు. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఒక బెడ్ ఏర్పాటు చేసినట్లు సోను ట్వీట్ చేసారు. అయితే కాసేపటి తర్వాత తామెవ్వరు సోను సూద్ టీమ్ ను బెడ్ కావాలని సంప్రదించలేదని గంజాం జిల్లా కలెక్టర్ పేరుమీదుగా ఒక పోస్ట్ వచ్చింది. దీంతో సోను పై అందరు సందేహం వ్యక్తం చేసారు. అతని సేవలు కూడా ఇలాంటివేనని కామెంట్స్ కూడా చేశారు.

దీంతో సోను సాక్ష్యాలను బయట పెట్టారు. సదరు బాధితుడితో జరిగిన వాట్సాప్ చాట్ సంభాషణను స్క్రీన్ శాట్ తీసి బయటపెట్టారు. అతను ఆక్సిజన్ బెడ్ కావాలని కోరాడని, తాము ఏర్పాటు చేసినట్లు , అతను ధన్యవాదాలు చెప్పినట్లు అటువంటి తదితర వివరాలు అందులో ఉన్నాయి. అంతేకాదు తాము ప్రభుత్వ వర్గాలను సంప్రదించినట్లు చెప్పలేదని , ఏదోలా బాధితుడికి ఆక్సిజన్ బెడ్ అందేలా చూశామని చెప్పాడు సోనూసూద్. అదే సందర్భంలో ప్రభుత్వం చేస్తున్న సేవలను కూడా కొనియాడారు సోను . అప్పటి వరకు సోనుసూద్ పై నిందలు వేసిన వారంతా, నోటికి తాళం వేసుకున్నారు. మనదేశంలో చెడు చేసేవారికన్నా , మంచి పనులు చేసే వారిపైనే ఎక్కువ ద్రుష్టిపెట్టి మరి విమర్శిస్తారు. ఇదే మనదేశం దౌర్భాగ్యం . ఇకనైనా మారుదాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles