Thursday, July 22, 2021
spot_img

బంగారం కన్నా రేటు ఎక్కువ ఉన్న చేప ఇదే..ఎందుకంటే?

మాములుగా చేపల ధరలు వందో లేక రెండు వందలో ఉంటుంది..మహా అయితే 500 ఉంటుంది .. అక్కడే మీరు పప్పులో కాలేశారు.. బంగారం కన్నా విలువైన చేపలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ కాదు అది జపాన్ లో.. సీ-ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. అక్కడి మార్కెట్లలో వివిధ రకాల చేపలు ఉంటాయి. . రుచిని, పోషక విలువలను బట్టి సదరు చేపల రేట్లు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధ ఉనాగి చేపలు కూడా ఉన్నాయి. ఇది ఈల్ ఫిష్. ఈ రకం చేపలను మంచినీటిలో పెంచుతారు. ప్రత్యేకత ఏమిటంటే జపాన్‌లో దీని ధర బంగారంతో సమానం.

2018 లో ఈ చేప కిలోకు 35 వేల డాలర్ల ధరకు అమ్ముడైంది. అక్కడ బంగారం ధర కూడా ఇంచుమించు దానికి సమానంగా ఉంది. జపాన్‌లో ప్రజలు ఈల్ ఫిష్‌ని చాలా ఇష్టపడతారు. కొన్నేళ్లుగా ఇది ప్రజలకు ఇష్టమైన ఆహారం. హోటళ్ళు, రెస్టారెంట్లలో ప్రతి సంవత్సరం సుమారు 50 టన్నుల ఈల్ చేపలు అమ్ముడవుతాయి. తూర్పు ఆసియాలో లభించే ఈ చేపల పిల్లలు మంచినీటిలో పెంచుతారు.పశుగ్రాసం, గోధుమలు, సోయాబీన్, చేప నూనె వంటి ఆహారం ఇస్తారు.

ఇందుకోసం చాలా ఖర్చవుతుంది. వాటిని చాలా జాగ్రత్తగా పెంచాలి. ఒక చేపకు ఏదైనా జబ్బు బారిన పడితే, దానితో పాటు ఉన్న చేపలన్నీ చెడిపోతాయి. ఈల్ ఫిష్ పిల్లలు పెరగడానికి 6 నుండి 12 నెలల సమయం పడుతుంది. ఇక్కడ నుండి, సాధారణ ప్రజలు, హోటళ్ళు, రెస్టారెంట్లు వాటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తాయి. జపాన్‌లో ఒక పండుగ సందర్భంగా ఈల్ ఫిష్ తినే సంప్రదాయం కుడా ఉందట.. అయితే వీటిని కట్ చేయడం, కూర వండటం అనేది చేయడానికి వాళ్లకు జీవిత కాలం పడుతుందని పేర్కొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles