Tuesday, August 3, 2021
spot_img

బంగారం ధర పలుకుతున్న చేపపిల్లలు

సాధారణంగా చేపల ధర అందుబాటులోనే ఉంటుంది. కాని ఒకరకమైన చేపకు మాత్రం బంగారం రేంజ్ లో ధర ఉందంటే నమ్ముతారా మీరు. జపాన్ లో సముద్ర చేపలను బాగా ఇష్టపడతారు. అక్కడ మార్కెట్లలో వివిధ రకాల చేపలుంటాయి. రుచిని , పోషక విలువలను బట్టి ధరలు ఉంటాయి. వీటిలో ప్రసిద్ధమైన ఉనాగి చేపలు కూడా ఉన్నాయి. తర్వాత హీల్ ఫిష్ వీటి ధర జపాన్ లో బంగారం తో సమానం. 2018లో కిలో హీలీఫిష్ ధర 35. 000 వేల డాలర్లకు అమ్ముడయింది. అప్పుడక్కడ బంగారం ధర కూడా ఈ చేపతో సమానమైంది.

జపాన్ ప్రజలు హీల్ ఫిష్ ని చాలా ఇష్టపడి తింటారు. కొన్నేళ్లుగా ఇదే ప్రజలకు ఇష్టమైన ఆహారంగా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం అన్ని హోటల్స్ లో సుమారుగా 50 టన్నుల హీల్ చేపలు అమ్ముడవుతాయి. తూర్పు ఆసియా లో లభించే ఈ చేపపిల్లలు మంచి నీటిలో పెంచుతారు. ఒక సంవత్సరానికి అవి అమ్మకానికి వచ్చి , విలువైనవిగా మారతాయి. ఈ చేపలు జపాన్ లో చాలా ఖరీదైనవి. ఎందుకంటే 1975 తర్వాత వాటి సంఖ్యా 70% క్షిణించాయి. అప్పుడు ప్రజలు తమకు అవసరానికి మించి పట్టారు. మరియు వాటి పెంపకం ఖర్చు కూడా కారణం అని చెప్పవచ్చు.

హీల్ చేపలను పిల్లలుగా పట్టుకొని పెంచాలి. వాటికీ పశుగ్రాసం , గోధుమలు, సోయాబీన్స్ ,చేప నూనెలు వంటివి ఆహారంగా ఇస్తారు. దీని కోసం చాలా ఖర్చవుతుంది . మరియు చాలా జాగ్రత్తగా పెంచాలి. ఒక చేపపిల్లకు రోగ మొస్తే మిగతా వాటికీ కూడా వచ్చి చనిపోతాయి. హీల్ ఫిష్ చేప పిల్లలు పెరగడానికి 6 నుంచి 12 నెలల సమయం పడుతుంది. తర్వాత వాటిని పొడవు ప్రకారం విభజించి విక్రయిస్తారు. ఈ విధంగా హీల్ ఫిష్ ని అధిక ధరకు హోటల్స్ , రెస్టారంట్ లలో కొనుగోలు చేసి విరివిగా అమ్ముతారు. జపాన్ లో ఒక పండగ సందర్బంగా హీల్ ఫిష్ తినే సాంప్రదాయం కూడా ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles