Sunday, July 25, 2021
spot_img

బడ్జెట్ లో ముఖ్యమైన కేటాయింపులు

సంక్షేమమే ధ్యేయంగా దూసుకువెళ్తున్న ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం పేదలకు భారీ స్థాయిలో పథకాలను ప్రవేశపెట్టింది. కేటాయింపుల్లో జగన్ నవరత్నాలు మరోసారి ధగ ధగ లాడాయి.గత ఆర్ధిక సంవత్సరం 2,24,789 కోట్లతో బడ్జెట్ మొదలుపెట్టిన జగన్ , ఈసారి బడ్జెట్లో కేటాయింపులను మరికాస్త పెంచింది. 2,29,779 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఎక్కువ కేటాయింపులని పధకాలకు కేటాయిస్తూ , జగన్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ముఖ్యముగా కులాల ప్రాతిపాదికగా చూసుకుంటే గత ఏడాదితో పోల్చితే ఈసారి వెనుక బడిన కులాల వారికీ 32% కేటాయింపులిచ్చారు. కాపు సంఘానికి 7% అదనంగా నిధులు కేటాయిస్తూ, ఏకంగా 33,006 కోట్ల రూపాయలను కేటాయించారు.

అటు బ్రాహ్మణుల సంక్షేమం కోసం దేశంలో కని విని ఎరుగని రీతిలో 189% అధికంగా నిదులను కేటాయించారు. ఇక SCసబ్ ప్లాన్ లో 22%, STసబ్ ప్లాన్ లో 27%,EBC సంక్షేమానికి 8% అదనంగా నిధులు కేటాయించి తన పెద్ద మనసు చాటుకుంది జగన్ ప్రభుత్వం. వ్యవసాయం ,విద్య ,వైద్య రంగాలకు పెద్ద పీఠవేస్తూ, భారీగా నిధులు కేటాయించింది. వ్యవసాయానికి 11,210 కోట్లు, విద్యకు 24,624 కోట్లు, వైద్యానికి 13,830 కోట్లు కేటాయించింది. ఇక నేరుగా నగదు బదిలీ చేసే పధకాలను కూడా భారీగా కేటాయించింది. ysr పెన్షన్లు, భరోసా, సున్నా వడ్డీ రుణాలు , డ్వాక్రా ఋణం, జగనన్న చేదోడు , కాపు నేస్తం, వాహన మిత్ర , మత్స్యకార భరోసా , అమ్మ వడి వంటి పధకాలకు గతేడాది కంటే ఎక్కువ కేటాయింపులు చేసారు. ఇలా అన్ని వర్గాల వారిని సంతృప్తి పరుస్తూ జగన్, రాష్ట్ర బడ్జెట్ ను కేటాయించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles