Friday, July 30, 2021
spot_img

బరువు తగ్గాలంటే ఇలా చెయ్యండి

చాలా మంది శరీర బరువు తగ్గాలని ఏం చేద్దామని చూస్తారు. అయితే త్వరగా మీకు బరువు సహజంగా తగ్గాలంటే ఈ ఐదు టిప్స్ ను పాటించాలి.

మొదటి టిప్ వచ్చేసి : రైస్ మానేసి ,ఆయిల్ లేకుండా చేసిన 2రోటీలు లేదా 2జొన్న రొట్టెలు తినండి. 1 గ్లాస్ రైస్ లో 300 క్యాలరీలు ఉంటె, అదే రోటిలో 150 క్యాలరీలుంటాయి. కావున బరువు తొందరగా తగ్గాలంటే ముందు రైస్ మానేయాలి.

Food background with assortment of fresh healthy organic fruits and vegetables on the table

రెండవ టిప్: కూరలు బాగా తినాలి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కానీ వీటిలో ఆయిల్ ఎక్కువగా వాడకూడదు. ముఖ్యంగా ఆయిల్, ఉప్పు సాధ్యమైనంత వరకు తగ్గించాలి. కర్రీస్ బాగా తినటం ద్వారా 150 క్యాలరీలు వస్తాయి. వీటి వల్ల శరీరానికి ఎలాంటి కొవ్వు రాదు , విటమిన్స్ అందుతాయి.

మూడవ టిప్: తొందరగా రాత్రి భోజనానికి పండ్లనే తినాలి. వీటి వల్ల 600-900 కాలరీస్ వస్తాయి. అవి రాత్రి 9 లోపు అయిపోతాయి. రాత్రంతా కూడా మనలో నిల్వ ఉన్న కొవ్వు కరిగి శరీరానికి అందచేస్తాయి. పొట్ట వెంటనే కరగాలంటే రాత్రి 6-7 గం ..ల్లో పండ్లను తీసుకోవాలి. దీని ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

నాల్గవ టిప్: ఉదయాన్నే మొలకెత్తిన గింజలను మరియు బొప్పాయను టిఫిన్ గా తీసుకోండి. వీటి ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తుంది.

చివరగా ఐదో టిప్ : రోజుకు 2 నుంచి 2.5 కి.మీ నడవాలి. మరియు వ్యాయామాలు కూడా చేయాలి. అంటే ఉదయం రెండు గంటలు మరియు సాయంత్రం గంటసేపు ,ఇలా ప్రతిరోజు ఈ ఐదు టిప్స్ ను పాటిస్తే తొందరగా బరువు తగ్గి , ఆరోగ్యం గా తయారవుతారు. ఈవిధంగా సహజంగా బరువు తగ్గవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,875FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles