Tuesday, August 3, 2021
spot_img

బ్లాక్ ఫంగస్ , ఇతర వైరస్ లతో పోరాడాలంటే

మనందరిలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని ఉంటుంది. కొంత మందికి వైరస్ సోకి, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనలోని రక్షణ వ్యవస్థ పనితీరు తగ్గుతుంది. మరి కొంత మందికి వైరస్ ఇన్ఫెక్షన్ రాకున్నా కూడా తరచు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు వారి యొక్క రక్షణ వ్యవస్థను రెట్టింపు చేసుకోవాలి. రక్షణ వ్యవస్థను పెంచటానికి ఆహార పదార్ధాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. మందుల వల్ల కాకుండా మంచి డైట్ వల్ల ఇమ్మ్యూనిటి చాలా తొందరగా పెరుగుతుంది. అందులో భాగంగా పుల్లటి పెరుగు ,పుల్లటి మజ్జిగ ఉపయోగపడతాయి. మనం తియ్యటి పెరుగు , మజ్జిగ మాత్రమే తీసుకుంటాము , కానీ పుల్లటి పెరుగు,మజ్జిగ ద్వారా ఆరోగ్యానికి , రక్షణ వ్యవస్థకు చాల ఉపయోగపడుతుంది.

మన పూర్వికులు ఎక్కువగా ఈ పుల్లటి పెరుగు, మజ్జిగలను కుండలలో పోసి తాగేవారు. వారికీ తెలియకుండానే ఇలా చేసేవారు. ఇమ్యూనిటీని పెంచుకునేవారు. పుల్లటి పెరుగు ,మజ్జిగ ద్వారా శరీరం పేగుల్లో ఉండే హానికర వైరస్లతో పోరాడుతుంది. పెరుగులో అధికంగా ఉండే లాక్టోబాసిల్లస్ బాక్టీరియా పేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచుతుంది. ఇకనైనా పుల్లటి పెరుగు ,మజ్జిగ తో మన ఇమ్మ్యూనిటి పవర్ను పెంచుకుందాం. ఈ విధంగా పుల్లటి పెరుగులో లాక్టోబాసిల్లస్ బాక్టీరియా పెరిగి మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

బ్లాక్ ఫంగస్ ,ఇతర వైరస్ లు మనకు సోకిన వాటి నుండి త్వరగా కోలుకునేలా ఈ పుల్లటి పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం తీసుకునే మందులు ,యాంటీ స్టెరాయిడ్స్ వల్ల పేగుల్లో మంచి బాక్టీరియాలను కోల్పోతాం . అలాంటి సమయంలో ఈ పుల్లటి పెరుగు తీసుకోవడం వలన తొందరగా ఫ్రెండ్లీ బాక్టీరియాలను పునరుత్పత్తి చేసుకోవచ్చు. పుల్లగా అంటే మరిపులుగా కాకుండా తీసుకోవాలి . ఇలా చేస్తే మన శరీరంలో ఇమ్మ్యూనిటి పవర్ తొందరగా పెంచుకోవచ్చు. అప్పుడు ఎలాంటి వైరస్ లు వచ్చిన మన శరీరం తట్టుకుంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles