Thursday, August 5, 2021
spot_img

మందు బాబులకు హెచ్చరిక

మందు తాగే వారికీ తాజాగా ఒక పరిశోధన సంస్థ హెచ్చరించింది. సాధారణ మనుషుల కంటే మద్యం సేవించే వారిపై కరోనా వైరస్ ఎక్కువగా దాడి చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ స్కిల్ & నాలెడ్జి టాస్క్ మరియు భారత సమాఖ్య నిర్వహించిన సమావేశంలో నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. మొదటి దశలో వృద్ధులు , దీర్ఘకాలిక రోగులపై ఎక్కువగా ప్రభావం చూపగా , రెండవ దశలో యువత , గర్భిణీలు కరోనా భారీన పడుతున్నట్లు చెప్పారు. శిశువులు, చిన్నారులలో దీని ప్రభావం ఎక్కువగా చూపటం లేదని చెపుతున్నారు.

అయితే మద్యం అధికంగా తీసుకునే వారిపై , ధూమపానం చేసేవారిపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. వారిలో కోలుకునే రేటు తక్కువగా ఉందని చెప్తున్నారు. దీనికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే కారణమని చెబుతున్నారు. అందువల్ల ప్రతిఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారంతా వాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. రెండు డోసులు కూడా వేయించుకోవాలని చెప్పారు. రెండో డోసు 4 నుంచి 8 వారాల్లోగా వేయించుకోవాలని చెప్పారు.

ఇక ఫలితాలు మాత్రం రెండో డోసు తీసుకున్నాక 15రోజుల తర్వాత మాత్రమే కనిపిస్తాయని చెప్పారు. వాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా వచ్చే అవకాశం 30% వరకు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కావున అందరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక మద్యం మానేయటం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోచ్చని నిపుణులు అంటున్నారు.
మందు బాబులకు హెచ్చరిక

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles