Wednesday, August 4, 2021
spot_img

మరోసారి ఏనుగు బురద గుంటలో చిక్కుకున్న ఘటన

కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ఏనుగు బురద గుంటలో చిక్కుకున్న ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని కూర్గ్ అటవీప్రాంతంలో ఒక ఏనుగు బురద గుంటలో పడింది. పైకి ఎక్కేందుకు ఏనుగు ప్రయత్నిస్తున్నప్పటికీ బురద కారణంగా జారీ కిందకు పడిపోతుంది. దీంతో ఎంత ప్రయత్నించినా ఏనుగుకు పైకి వెళ్లే దారి కనిపించలేదు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది… ప్రొక్లైన్ సహాయంతో ఏనుగును బయటకు తీశారు.

బయటకు వచ్చిన ఏనుగు ప్రొక్లైన్ వైపు చూసి… కృతజ్ఞత తెలుపుతున్నట్టుగా తల ఊపింది. అయితే ఏనుగు కంగారులో జనం పైకి వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన అటవీ సిబ్బంది….. టపాసులు పేల్చడంతో ఏనుగు సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి పరిగెత్తింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ ఇండియాలో వైరల్ అవుతుంది. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వు ప్రాంతంలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకోగా… అటవీశాఖ అధికారులు ప్రొక్లైన్ తో ఏనుగును బయటకు తీశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles