Sunday, July 25, 2021
spot_img

మానవత్వం చాటుకున్న సీఐ శ్రీరాములు

కర్నూలు జిల్లా ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో లాక్ డౌన్ కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీరాములు ఒకపక్క నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ, మరో పక్క సేవాభావంతో కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో పట్టణంలోని యాచకులకు , అనాధలకు , నిరాశ్రయులకు , ఆస్పత్రి దగ్గర ఉండే రోగులకు ఆకలి ఆవేదన పరిస్థితిని మానవత్వంతో ఆలోచించి వారికీ నేనున్నానంటూ సీఐ శ్రీరాములు వారికి భోజనం ప్యాకెట్లు అందించి వారి ఆకలిని తీర్చారు.

సిఐ శ్రీరాములు మాట్లాడుతూ దేవుడిచ్చిన సంపాదనలో, ఏమి లేని వారికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, వారికే అన్నం పంచెటప్పుడు వారి దీవెనలు చాలా తృప్తినిచ్చాయని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్న సామెత ఇలాంటి వారికి సహాయం చేయడంలో కనిపించిందని ఆయన తెలిపారు. కావున ఈ కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరు చేతనైన సాయాన్ని ఆపదలో ఉన్న , దయనీయ పరిస్థితులలో ఉన్న వారికీ సేవ చేయాలంటూ సీఐ శ్రీరాములు గారు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles