Sunday, July 25, 2021
spot_img

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చాలా స్పీడ్ గా ఉన్నారు. యంగ్ డైరెక్టర్స్ కు వరుసగా అవకాశాలిస్తున్నారు. ఇప్పటికే తను నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయి, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు , అయ్యప్పనం కోషియమ్ రీమేక్ చిత్రాలను చేస్తున్నారు. అంతేకాదు దిల్ రాజుతో రెండవ సినిమా కూడా చేస్తున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కూడా సరే అని చెప్పారని వార్తలొస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ ,తీన్మార్ వంటి సినిమాలు తీసిన బండ్ల గణేష్ , మరో సినిమాను కూడా పవన్ తో తీస్తారని ప్లాన్ చెస్తున్నట్లు మనకు తెలిసిందే. అయితే పవన్ కోసం ఏ దర్శకుడిని నియమిస్తాడోనని , ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బండ్ల గణేష్ డైరెక్టర్ ని ఫిక్స్ చేసినట్లు , అలాగే పవన్ కు సినిమా కథ చెప్పినట్లు వార్త హల్ చల్ చేస్తుంది.

ఆ డైరెక్టర్ రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రమేష్ వర్మ , పవన్ కళ్యాణ్ కి ఒక కథ ను వినిపించారట. అయితే కథ పవన్ కళ్యాణ్ గారికి నచ్చటం తో ,పూర్తి స్క్రిప్ట్ తాయారు చేసుకోమని చెప్పారట. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఇది అసత్యం అని అంటున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ కిలాడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖచ్చితాంగా కిలాడి హిట్ అవుతోందన్న నమ్మకం తో ఉన్నారు. ఇదే క్రమంలో పవన్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది నిజమే అయితే రమేష్ వర్మ పవన్ కళ్యాణ్ గారిని హ్యాండిల్ చేయగలడా లేదా అనే సందేహంలో ఫాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఎంత నిజముందో తెలియాంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles