Friday, July 23, 2021
spot_img

విశ్వ సుందరిగా ఆండ్రియా మెజా

ప్రపంచ సుందరిగా ఆండ్రియా మెజా ఎంపికైనది. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీల ఫైనల్లో నిలిచి, విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. తొలి రన్నరపు గా మిస్ బ్రెజిల్ జూలియా గామా , రెండవ రన్నరపు గా మిస్ పేరు జానిక్ మేసేటా డెల్ కాసినోగా నిలిచారు. మిస్ ఇండియా అడలిన్ కాస్టేలియానో సైతం గట్టి పోటీ నిచ్చి ,టాప్ 5లో నిలిచింది. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ జోజి బిని తుంజి విజేత ఆండ్రియాకు కిరీటం అందించింది. మొత్తం 70 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీల్లో విజయం సాధించిందని చెప్పగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి లోనైయింది. కన్నీటి పర్యంతం అవుతూనే క్యాట్ వాక్ పూర్తి చేసింది.

మెక్సికోలోని ఛీహువాకు చెందిన 26 యేండ్ల ఆండ్రియా సాఫ్ట్ వెర్ ఇంజినీరింగ్ లో పట్టా పుచ్చుకున్నది. మోడలింగ్ పై ఆసక్తి గల ఈ భామ ఛీహోవా టూరిసుమ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ , తమ సంస్కృతి ,సాంప్రదాయాల గురించి ప్రపంచానికి సాటి చెబుతుంది. అంతే కాకుండా మహిళా హక్కులపై ఉద్యమిస్తూ , లింగ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. ఇక సర్టిఫైడ్ మోడల్ మేకప్ ఆర్టిస్ట్ అయిన ఆండ్రియాకు క్రీడలంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఆమె పూర్తి శాఖాహారిగా మారిపోయింది.

ఫైనల్లో అందానికి ప్రమాణం ఏంటి అనే ప్రశ్నకు ,అత్యంత నాగరిక సమాజంలో మనం ఉన్నాం .అదే సమయంలో మనతో పాటు కొన్ని కట్టుబాట్లను ముందుకు తీసుకుపోతున్నాం. అందం అనేది బాహ్య రూపు రేఖలకు సంబందించినది కాదు , మన ఆత్మలో గొప్ప మనసు కలిగి ఉండటంలోనే ఉంటుంది . మనం విలువ కలిగిన వ్యక్తులం కాదని ,ఎదుటి వారు మనల్ని అవహేళన చేసేందుకు అస్సలు అవకాశం ఇవ్వకూడదని సమాధానమిచ్చి , ఆండ్రియా మెజా 69వ ప్రపంచ సుందరిగా నిలిచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,866FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles