Sunday, July 25, 2021
spot_img

శరీరంలో ఆక్సిజన్ పెంచే పదార్ధాలు

ప్రస్తుతం దేశంలో అతి పెద్ద సమస్య కరోనా రోగులకు అవసరమైనంత ఆక్సిజన్ లేదు. కావున చాలా మంది చనిపోతున్నారు. మన శరీరంలో ఆక్సిజన్ సహజంగా పెంచుకోవడం మంచిది. అయితే మీ రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి , మీ ఆహార పదార్దాలలో 80 శాతం ఆల్కలీన్ ఆహారాలు ఉన్నాయని మీరు నిర్ధారించుకోవాలి.

ఇది మీ రక్తం మొత్తంలో ఆక్సిజన్ పెంచడానికి సహాయపడుతుంది. మీ రక్తంలో సహజంగా ఆక్సిజన్ పెరగడానికి కొన్ని ఆహార పదార్ధాలు తినాలి. అవి అవకాడో , బెర్రీస్ తినాలి. వీటిలో యాంటీ ఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. వీటి PH విలువ 8. మిరియాలు ,బెర్రీలు ,వెల్లుల్లి రక్తపోటును నియంత్రించటానికి సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి కాకుండా పండిన అరటి పండ్లు ,క్యారెట్లు,ద్రాక్ష కూడా మీ రక్తంలో ఆక్సిజన్ పెంచుతాయి.

కివి,మామిడి,బొప్పాయి వీటిలో కూడా PH విలువ 8.5 గా ఉంటాయి. కిడ్నీ ప్రక్షాలణకు బాగా పనిచేస్తాయి. బొప్పాయి పెద్ద పేగులను శుభ్రపరచటానికి సాహయపడుతుంది. పేగు కదలికను నియంత్రిస్తుంది. ఇక క్యాప్సికమ్ ఎండోక్రైన్ వ్యవస్థ [వినాళికా గ్రంథి వ్యవస్థ] కు అవసరమైన ఎంజైమ్స్ వీటిలో పుష్కలంగా ఉన్నాయి.క్యాప్సికమ్ లో విటమిన్ ‘ఏ’ ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధులు ,ఒత్తిడి కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియలను కూడా కలిగి ఉంటుంది.

పుచ్చకాయ PH విలువ 9 ,అధిక నీరు ,ఫైబర్ కారణంగా తేలికపాటి మూత్ర విసర్జనగా పనిచేస్తుంది. చివరగా నిమ్మకాయలో కూడా ఆక్సిజన్ పెంచే కారకాలు ఉన్నాయి. ఇవి శరీరం వెలుపల ఆమ్లాలుగా ఉన్నప్పటికీ , శరీరం లోపల ఆల్కలీన్ అవుతాయి.ఇవి అద్భుతమైన ఆల్కలీన్ ఆహారంగా మారుతాయి. దగ్గు,జ్వరం ,ఫ్లూ ,హైపోక్సిటీ ,గుండెలో మంట ఇతర రోగాలకు ఇది శక్తి వంతమైన నివారణగా చెప్పవచ్చు. ఈ ఆహారపదార్ధాలు శరీరంలో ఆక్సిజన్ పెంచడానికి మేలుచేస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles