Saturday, July 17, 2021
spot_img

సైబర్ క్రైమ్ నేరగాళ్లతో జాగ్రత్త

కరోనా నుంచి తప్పించుకునేందుకు ప్రతిఒక్కరు వాక్సినేషన్ గురించి ఎదురు చూస్తున్నారు . ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కోవిడ్ – 19 వాక్సినేషన్ పేరుతో కేటుగాళ్లు ఫోన్ చేస్తున్నట్లు కేంద్ర సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. ఈ నకిలీ కేటుగాళ్లు తమను తాము ప్రభుత్వాధికారులుగా , పలు వాక్సిన్ కంపెనీల డీలర్లుగా చెప్పుకుంటున్నారు. వారు ఫోన్ కాల్స్ మరియు మెసేజ్ ల ద్వారా లింక్ లను పంపి వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.

వాక్సినేషన్ కొరకు కేవలం cowin.gov.in లేదా ఆరోగ్యసేతు ఆప్ లోనైనా రెజిస్ట్రేషన్స్ చేసుకోవాలని చెప్పారు. కోవిడ్ తో బాధపడుతున్న సాటి వారికీ సాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. పక్కవారికి సాయపడాలన్న మంచి ఆలోచనను కుడా సైబర్ కేటుగాళ్లు తమ కాసుల కక్కుర్తికి వాడుతున్నట్లు కేంద్ర హోంశాఖా హెచ్చరించింది.

ఛారిటీల పేరిటఫిషింగ్ మెయిల్స్, సోసిల్ మీడియా పేరుతో గూగుల్ పే లో ,ఫోన్ నంబర్లు ఇవ్వటం, క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు పంపాలని కోరడం వంటివి చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. డొనేషన్స్ ఇచ్చే సమయంలో సంస్థ పేరు, ఇతర వివరాలను పరిశీలించాలని సూచించింది. వీలైనంత వరకు వ్యక్తి గతంగా విరాళాలు ఇవ్వాలని తెలిపింది .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles