Wednesday, August 4, 2021
spot_img

వామ్మో .. ఆర్జీవీ రాజకీయాల్లోకి వస్తాడా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదోక వార్తతో వార్తల్లో ఉంటాడన్న విషయం తెలిసిందే.. సినీ ఇండస్ట్రీ తో పాటుగా రాజకీయ నేతలను సైతం ఆయన వదల్లేదు..కరోనా, వ్యాక్సిన్‌, ప్రధాని మోదీ మీద విమర్శలు సంధిస్తున్న ఆయన రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. అయితే ప్రజలకు సేవ చేసే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకోవడం లేదని తెగేసి చెప్పారు. త్వరలో ఆయన ప్రారంభించనున్న స్పార్క్‌ ఓటీటీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”నాకు నేను ేసవ చేసుకోవడానికే టైమ్‌ సరిపోవడం లేదు. ఇక ప్రజలకేం చేస్తాను.

ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లే రాజకీయాల్లోకి వస్తారు. చాలామంది నేతలు ఫేమ్‌, పవర్‌ కోసమే అడుగుపెడతాడు. ఓటీటీ అనేది ప్రేక్షకులకి బాగా చేరువలో ఉంటుంది. నాకు తెలిసిన వ్యక్తితో కలిసి ఈ నెల 15న స్పార్క్‌ ఓటీటీని ప్రారంభిస్తున్నా. అన్నిరకాల కథాచిత్రాలు అందులో అందుబాటులో ఉంటాయి. దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందిన ‘డీ కంపెనీ’ని సినిమా కూడా దీనిలోనే విడుదల కానుంది.. గతంలో విడుదల అయిన సినిమాలు అన్నీ కూడా ఏదో వచ్చి, పోయాయి..ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles