Saturday, July 24, 2021
spot_img

ఆ రాష్ట్రంలో మద్యం డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు..దీంతో మందుబాబు ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ మేరకు మందుబాబులకు దిల్లీ ప్రభుత్వం ఓ కిక్కిచ్చే వార్త చెప్పింది. మద్యం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హోండెలివరీకి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టళ్లు, మొబైల్‌ యాప్‌ల ద్వారా బుకింగ్స్‌ స్వీకరించి నేరుగా ఇంటికే మద్యాన్ని చేరవేసేందుకు మద్యం దుకాణాదారులకు అనుమతులు ఇచ్చింది.

ఈ మేరకు ఎక్సైజ్‌ చట్టంలో సవరణలు చేసింది. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ప్రజలు మద్యం దుకాణాల వద్ద గుమిగూడకుండా ఈ వెసులుబాటు కల్పించింది. మహమ్మారి కట్టడికి గత నెల రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమలు చేసిన దిల్లీ సర్కార్‌ నేటి నుంచి కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే.-మెయిల్‌ లేదా ఫ్యాక్స్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే మాత్రమే డెలివరీ అందుతుంది. తాజాగా యాప్‌లు, ఆన్‌లైన్‌ పోర్టళ్ల ద్వారా కూడా బుకింగ్స్ స్వీకరించేందుకు అనుమతి ఇచ్చారు.

అయితే, దిల్లీలో ఉన్న మద్యం దుకాణాదారులందరూ హోండెలివరీకి అర్హులు కాదు. కేవలం ఎల్‌-14 లైసెన్స్‌లు ఉన్నవారికి మాత్రమే హోండెలివరీ చేయడానికి అనుమతి ఉంది. దిల్లీలో పాజిటివిటీ రేటు భారీ తగ్గిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ మేరకు సడలింపులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోనూ మద్యం డోర్ డెలివరీకి ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,866FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles