Saturday, July 17, 2021
spot_img

పెద్దమనసు చాటుకున్న కమెడియన్..

కరోనా ప్రభావం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉపాధిని కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఇప్పటికీ అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుంది.. అలాంటి వారందరినీ కాకపోయినా కొందరినైనా ఆదుకునేందుకు మానవత్వం ఉన్న మనుషులు ఎందరో ముందుకు వచ్చి సహాయం అందించారు. అలా సహాయం అందించినవారిలో కమెడియన్ అలీ కూడా ఒకరు. లాస్ట్ ఇయరే కాదు.. ఇప్పుడు కూడా ఆయన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకునేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్‌ ప్రొడక్షన్‌ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు.అలీ ముందుకు వచ్చి పదికిలోల బియ్యం, నూనె, గోధుమపిండి, చక్కెరతో పాటు 8 రకాలైన సరుకులను వారికి అందించారు.ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ”ప్రతిరోజూ మేము షూటింగ్‌లకు వెళ్లే ముందే ఈ ప్రొడక్షన్‌ యూనియన్‌లోని ఆడవాళ్లు చాలా ముందుగా షూటింగ్‌ స్పాట్‌లకు వెళతారు… అలాంటి వాళ్ళను కొంతవరకు అయిన కాపాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles