Sunday, July 25, 2021
spot_img

ఛీ.. ఛీ.. అంబులెన్స్ లో కరోనా పై దాడి.. చివరికి..

మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది..ఎటు చూసినా కూడా రాక్షసులు కనిపిస్తున్నారు.. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా కూడా కామాంధుల మనసును మార్చలేక పోతున్నాయి.. కరోనా రోగులను కూడా వదల్లేదు అంటే సమాజం ఎంత నీచంగా మారింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మహిళ నిస్సహాయతను ఆసరాగా తీసుకోని అంబులెన్స్‌లోనే దారుణానికి ఒడికట్టాడు.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లాలో ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా మే 13న వెలుగులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న బాధితురాలు వైద్యులకు జరిగిన దారుణం గురించి చెప్పడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని ప్రశాంత్‌గా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.

ఊపిరి ఆడక బాధపడుతోంది. దీంతో ఆమెను ఏప్రిల్ 27న ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం అంబులెన్స్‌లో ల్యాబ్‌కు తరలించమని అక్కడి వైద్య సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిని ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు తరలిస్తున్న సమయంలో అంబులెన్స్ అటెండర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు.అయితే అప్పుడు బాధిత మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఈ దారుణం గురించి ఆమె ఎవరికి చెప్పలేకపోయింది. కొంచెం కోలుకున్నాక తర్వాత ఆ రోజు జరిగిన ఘటన గురించి డాక్టర్లకు తెలిపింది.. పరిస్థితిని అర్థం చేసుకున్న వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles