Wednesday, August 4, 2021
spot_img

కరీంనగర్‌లో మరో రెమ్‌డేసివర్ ఇంజక్షన్ల బ్లాక్ దందా..

కరీంనగర్‌లో మరో రెమ్‌డేసివర్ ఇంజక్షన్ల బ్లాక్ దందా నడుస్తుంది. ఆసుపత్రుల్లో పనిచేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు అమ్ముతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.అటు పోలీసులు ఇటు ప్రభుత్వం పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నా..రెమ్‌డెసీవిర్ ఇంజక్ష దందా మాత్రం ఆగడం లేదు. మెడికల్ మాఫియాలు కరోనా రోగుల బలహీనతను ఆసరా చేసుకుని వేల రూపాయల దోపిడికి పాల్పడుతున్నారు. దీంతో ప్రత్యేక నిఘా పెట్టిన పలు జిల్లాల పోలీసులు ముఠాలను కట్టడి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అటు నిజామాబాద్, వరంగల్, నల్గోండ,ఖమ్మం జిల్లాలతో పాటు తాజాగా కరీంనగర్ కూడ ఈ జాబితాలో చేరింది. ఇప్పటికే కరీంనగర్‌ పోలీసులు మొత్తం ముఠాలను పట్టుకున్నారు. తాజాగా మరి కొంత మందిని పోలీసులు పట్టుకున్నారు. పని చేసే ఆయా ఆసుపత్రుల్లో రెమిడెసివర్ ఇంజంక్షన్లను అవసరమైనపుడు వీరు ఒకరినొకరు తాము బ్లాక్ చేసి పెట్టుకున్న ఇంజక్షన్లను అధిక ధరలకు పేషెంట్లకు అందిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న కరీంనగర్ టాస్క్ ఫోర్స్ కరీంనగర్ లోని కిసాన్ నగర్ ప్రాంతంలో ప్రవిష్టా అపార్ట్మెంట్ వద్ద ఇంజెక్షన్లను అమ్ముతుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.కాగా వీరి వద్ద నుండి ఏడు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను, నాలుగువేల ఐదు వందల ముపై రూపాయల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles