Tuesday, July 20, 2021
spot_img

ఎలుకల పై ఆస్ట్రేలియా యుద్ధం..

ప్రపంచం మొత్తం కరోనా పై యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆస్ట్రేలియా ఎలకలతో యుద్ధం చేస్తున్నది. న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రాల్లో ఎలుకలు పుట్లకొద్దిగా పుట్టుకువస్తున్నాయి. స్థానికులను ఎవరిని కదిలించినా యుద్ధంలో సేనానిలా మాట్లాడుతున్నారు. తెలివైన ఎత్తుగడలు, శత్రువును ముగ్గులోకి దించడం, బుడ్డ జంతువులను తుదముట్టించడం గురించి వివరిస్తున్నారు. కానీ 6 నెలలు గడిచినా సమస్య తగ్గుముఖం పట్టలేదు. శత్రువును ఓడించడం మాట దేవుడెరుగు ఇప్పుడు ఎలుకలు ఆ ప్రాంతాలను మబ్బుల్లా కమ్మేస్తున్నాయి.

గాయం మానకపోగా నిరంతరం కెలుకుతున్నట్టుగా ఉంది. టన్నుల కొద్దీ పాయిజన్ ఉపయోగించినా మూషిక సంతానం అంతరించలేదు. స్థానికుల్లో ఒకరకమైన నిర్వేదం కనిపిస్తున్నది. ఈ ఎలుకల వల్ల ఎంతో నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.. దాంతో ఎలుకలను పూర్తిగా నాశనం చేసేందుకు 5 కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది.కొత్త ఎలుకల విషం కనుగొనడం, రైతులకు ఎలుకల విషం పాకెట్లు ఉచితంగా పంచడం, చిన్న వ్యాపారులకు, గృహస్థులకు ఎలుకల మందు రిబేట్లు ఇస్తున్నారు.

కానీ, సిడ్నీకి పశ్చిమంగా 500 కి.మీ. దూరంలో ఉండే తాలింబాలో నివసించే లూయిజ్ మెక్‌కేబ్ లాంటివారు సాయం చాలా ఆలస్యంగా అందినట్టేనని అంటున్నారు. ఎలుకల మందు ఇస్తున్నారు.. ఇదివ రకే జరిగిన నష్టం ఎవరు పూరిస్తారని ఆమె అంటున్నారు. నాలుగు రోజులు ఊరికెళ్లి తిరిగొచ్చి తలుపు తీస్తే ఇంటినిండా వేల ఎలుకలు అటూఇటూ పరుగెత్తుతూ కనిపించాయి మరి. కొత్త తివాచీ చీలికలు పేలికలైపోయింది. కిందనున్న కలప గచ్చు కూడా రంద్రాలతో నిండిపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,860FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles