Sunday, July 18, 2021
spot_img

బీఏ రాజు మృతి పట్ల బాలయ్య ఎమోషనల్..

ప్రముఖ నిర్మాత బీఏ రాజు లేరనే వార్త అందరిని కదిలించి వేస్తుంది.. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ మూగపోయింది. సినీ ప్రముఖులు విషాదంలో ఉన్నారు. తాజాగా ఆయన మృతి పట్ల సినీ నటుడు బాలకృష్ణ సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతో తనకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందని అన్నారు. మన మధ్య ఆయన లేరనే వార్త తనను కలచి వేసిందని చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ… రాజుగారి అకాలమరణం తనను ఎంతో బాధిస్తోందని అన్నారు. సినిమా పట్ల మీరు చూపించే ప్రేమను ఇకపై తామంతా ఎంతో మిస్ అవుతామని చెప్పారు. ప్రతి ఒక్కరి కోసం ఇంతకాలం మీరు నిలిచారని అన్నారు.హీరో విశాల్ మాట్లాడుతూ… తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి రాజుగారు తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. తనకు అండగా నిలిచిన సోదరుడు, స్నేహితుడైన రాజు మృతిని జీర్ణించుకోలేకున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,865FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles