Thursday, July 22, 2021
spot_img

వామ్మో.. బాలయ్య అలా అన్నాడట..

ప్రస్తుతం అందరి దృష్టి కరోనా పైనే వుంది.. కరోనా నుంచి తమని తాము ఎలా కాపాడుకోవాలి.. ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే ఆలోచనలో ఉన్నారు.. అలాంటి వారిని తమ వైపు లాక్కునెందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఏపీ, తెలంగాణ లో మాత్రం ఆనందయ్య కరోనా మందు పైనే తిరుగుతూంది.. ఈ విషయం పై తాజాగా బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా బాధితులకు ఆనందయ్య మందు బాగా పనిచేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన మందుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆనందయ్య మందుకు ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. తాజాగా నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మద్దతు ప్రకటించారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులు ఆనందయ్య మందు గురించి ప్రస్తావించగా తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఆనందయ్య కరోనా మందుపై తనకు నమ్మకం ఉందన్నారు. అభిమానం లేనిదే ఆరాధన లేదని, ఆరాధన లేనిదే మతం లేదన్నారు. మతం లేనిదే మానవుడే లేడన్నారు.అలాగే ప్రతీది ఒక నమ్మకం..ఆయుర్వేదాన్ని తాను తప్పకుండా నమ్ముతానని చెప్పారు.

మన దేశంలో గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశ్రుతుడనే వైద్యుడుండే వాడు. ఆ కాలంలోనే ఆయన ఓ గొప్ప సర్జన్. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో ఉన్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీలో ఇప్పటికీ ఆయన పేరు రాసుంటుంది. అలాంటి గొప్పవారిని మనం మరిచిపోయాం అని బాలయ్య చెప్పుకొచ్చారు.. దీంతో ఆనందయ్య మందు మరోసారి ప్రాముఖ్యత ను సం

రించుకుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles