Thursday, August 5, 2021
spot_img

అర’టీ ‘ అద్భుతాలే వేరయ్యా..

అరటి తో సీట్స్, పచ్చి అరటి తో స్నాక్స్ చేసుకుంటారు. కానీ ఇలా టీ కూడా చేసుకుంటారా అనే ఆలోచనలో ఉన్నారు కదూ.. మీరు విన్నది నిజమే.. ఈ టీ వల్ల ఎన్నో నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి చూద్దాం.. దాని రుచి కూడా చాలా బాగుంటుందట. అరటి పళ్లు విరివిగా దొరుకుతాయి. చాలా ప్రాంతాల్లో భోజనానికి బదులుగా అరటిని తింటారు. ఇందులో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. తక్షణ శక్తినిచ్చే ఈ పండు మనకు రిజనబుల్‌ ధరల్లో అందుబాటులో ఉంటాయి.

అలాగే చాలా రెసిపీల్లో అరటీ పండ్లను వాడతారు. టీ లో కూడా దీన్ని ట్రై చేశారు. టీ రుచి అదుర్స్‌ అందుకే ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చింది. ఈ టీతో రిలాక్సేషన్‌ ఫీలింగ్‌ కూడా వస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. ముందుగా అరటి పండును ఓ పదినిమిషాలు బాగా ఉడికించాలి. అది ఉడుకుతున్నప్పుడు బుడగలు వస్తాయి, దాన్ని తీసేసి ఆ నీటిని తాగుతారు. దీనిలో ఏమీ కలపాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా రుచిగా ఉంటుంది. మీకు న చ్చితే అరటి తొక్కతోపాటు ఉడికించుకోవచ్చు. తొక్కే కదా అని తీసేయకండి. ఇందులో ఎక్కువ శాతం ఫైబర్‌ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య తీరుతుంది. అలాగే ఈ ఆహారం వెంటనే రక్తంలో కలిసిపోకుండా చేస్తుంది. అందుకే డయాబెటీస్‌ ఉన్న వారికి ఇది మంచిది. మీకు నచ్చిన విధాంగా ఇందులో దాల్చిన , లేదా తేనే వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles