Sunday, July 25, 2021
spot_img

మట్టి కుండలో నీళ్లను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..

మట్టి కుండలో నీళ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి ఉత్సహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు మట్టికుండలో నీటివల్ల ఉపయోగాలేంటో ఒక్కసారి చూసేద్దామా..

మట్టికుండ శరీరానికి హాని కలిగించే రసాయనాలను వడపోస్తుంది. ప్రతి రోజూ మట్టికుండలో నీటిని తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. సాధారణంగా నీటిని శుద్ధి చేసినప్పుడు కొన్ని రకాల సహజ ఖనిజలవణాలు కోల్పోతాము. కానీ, మట్టికుండలో నీటిని తాగడం వల్ల నీటిలోని ఖనిజలవణాలను పూర్తిగా శరీరానికి అందుతాయి. అందువల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది..

ఇకపోతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే..శరీరంలో సరైన నీటిస్థాయులు లేనప్పుడు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోతారు. కొన్ని సార్లు దీనివల్ల ప్రాణాపాయం కూడా కలగవచ్చు. మట్టి కుండలో నీటిని తాగేవారిపై వడదెబ్బ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మట్టికుండ నీటిలోని పోషకాలు, ఖనిజలవణాలు శరీరాన్ని ఎప్పటికప్పుడు రీహైడ్రేషన్‌ చేయడంలో సహాయపడతాయని అంటున్నారు. కుండ లోని నీళ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles