Wednesday, July 21, 2021
spot_img

సుఖ ,సంతోషాలు కలగాలంటే ఈ పూజ తప్పనిసరి..!

ఉరుకులు, పరుగులు పెడుతున్న ఈ జీవితంలో డబ్బు మీద వ్యామోహం తో చాలా మంది సుఖ ,సంతోషాలు లేక పిచ్చివాల్లు అవుతున్నారు. కనీసం దేవుడిని ప్రార్థించే సమయం కూడా లేదంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఎలా ఈ సమాజం ఉందని. అలాంటి బాధలో ఉన్న వాళ్ళు ఈ విధమైన పూజలు చేస్తే తిరిగి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మరి ఆ పూజలు ఎంటి? ఎలా చేయాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తులసి మొక్క, అరటి చెట్టు, రావి చెట్టు మొదలైనవి వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే అరటి చెట్టు అంటే విష్ణు మూర్తికి చాలా ఇష్టం. చాలా మంది అరటి చెట్టు దగ్గర కూర్చుని ఉపవాసం చేసి పూజ చేసి దీపం వెలిగిస్తారు.. ఆ చెట్టు దగ్గర కూర్చొని పూజలు చేస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం..

పురాణాల ప్రకారం అరటి చెట్టును పూజించడం వల్ల విష్ణు మూర్తి అనుగ్రహం పొందవచ్చు అని అంటారు. ముఖ్యంగా గురువారం నాడు పూజ చేయడం మరింత మంచిది.మీ ఇంట్లో కనక ఆర్థిక ఇబ్బందులు, గొడవలు, అశాంతి లాంటివి ఏమైనా ఉంటే అరటి చెట్టు దగ్గర పూజ చేసి దీపం వెలిగించి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టడం వల్ల సుఖశాంతులు కలుగుతాయని ఆరోగ్యం బాగుంటుందని, ఆనందంగా ఉండొచ్చు అని పండితులు చెప్తున్నారు.

ప్రతి రోజూ ఉదయం లేచి .. అరటి చెట్టును ఎంతో పవిత్రంగా పూజలు చేస్తే సకల భోగాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. మీరు ఈ విధంగా పూజలు చేసి అన్నీ విధాలా ప్రయోజనాలు పొందండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,862FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles