Thursday, August 5, 2021
spot_img

మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజెన్ మీ దగ్గరకే..

ప్రస్తుతం దేశం కరోనా మహమ్మరి కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ముఖ్యంగా కరోనా రోగులకు ఆక్సిజెన్ కొరత ఏర్పడింది.. చాలా మంది ఆక్సిజన్ లేకపోవడంతో ప్రాణాలను వదిలెస్తున్నారు.. ఆక్సిజన్ కొరతను తీర్చడానికి సత్వర చర్యలను తీసుకుంటున్నారు..ఇందులో భాగంగా హిందుస్తాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ పోర్టియా మెడికల్‌- కేవీఎన్‌ ఫౌండేషన్‌లు సంయుక్తంగా మిషన్‌ హెచ్‌ఓ2పీఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నగరంలో ఆక్సిజన్‌ను ఉచితంగా అందించనున్నట్లు హెచ్‌యూఎల్‌ చైర్మన్‌- మేనేజింగ్‌ డైరెక్టర్‌, సంజీవ్‌ మెహతా తెలిపారు. బెంగళూరు, ఢిల్లీలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ‘వాడుకుని-తిరిగి ఇచ్చే పద్ధతి’లో అందుబాటులో ఉంచగా అక్కడ సక్సెస్‌ అయ్యారు.ఆ తరువాత హిందుస్తాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ ఇప్పుడు మిషన్‌ హెచ్‌2పీఈని హైదరాబాద్‌లో ప్రారంభించింది.

హెచ్‌యూఎల్‌, కేవీఎన్‌ ఫౌండేషన్‌, హోమ్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ పోర్టియా మెడికల్‌ భాగస్వామ్యంతో కొవిడ్‌-19 రోగులకు పూర్తి ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను సమయానికి అందించనున్నారు.కావాల్సిన వారు 080-68065385 కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలి. హెచ్‌యూఎల్‌తో భాగస్వామ్యంతో అత్యవసర ఆక్సిజన్‌ అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles