Sunday, July 25, 2021
spot_img

ధనియాల నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు..

మన దేశంలో ధనియాలకు మంచి డిమాండ్ ఉంది.. మసాలా దినుసుల లో ఒకటైన వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం..

ఎముకల నొప్పులను ఇట్టే తగ్గించడం లో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇకపోతే శరీరంలో నీటిశాతాన్ని తగ్గకుండా చూసుకుంటుంది. వేసవిలో ఇబ్బంది పెట్టే డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి రోజుకి రెండు గ్లాసుల ధన్యాల నీళ్ళు తాగితే చాలా మంచిది. శరీరంలో నీటిని సులభంగా పోనియ్యకుండా చూసుకుంటుంది. దానివల్ల బలహీనత ఉండదు.

కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. మూత్రపిండాలను పాడుచేసే మలినాలని బయటకి పంపించివేయడంలో ధన్యాలు కలిపిన నీళ్ళు బాగా ఉపయోగపడతాయి. వేసవిలో వేడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఎముకల బలానికి వీటిని తీసుకోవడం ఉత్తమం..

స్పూన్ ధన్యాలని తీసుకుని వాటిని కొన్ని మంచినీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టాలి. చిన్న మంట పెట్టి అలాగే ఉంచాలి. మనం పోసిన మంచినీళ్ళు సగం అయ్యేదాకా మరిగించాలి. ఆ తర్వాత వడపోసి గ్లాసులోకి పోసుకోవాలి. దీన్ని ఉదయం సాయంత్రం రెండుపూటలా తాగవచ్చు. కాకపోతే కిడ్నీ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల సలహా తోనే వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles